ధర్మరాజు యుద్ధంవల్ల కలిగే నష్టాలు చెప్పాడు గదా! ఈ రోజుల్లో కూడా యుద్ధాలు
యుద్ధాలు రాకుండా ఉండటానికి చేపట్టాల్సిన చర్యలేమిటి?
Answers
Answer:
Urdu bhasha
Explanation:
hope it will help you.
Answer:
జ. ఆర్థిక, సాంఘిక, రాజకీయ అసమానతలు, సామ్రాజ్యవాద ధోరణి, ఉగ్రవాదం, మానవతా విలువలు నశించడం మొదలగు
అంశాలన్నీ యుద్ధాలకు దారితీస్తాయి. యుద్ధాలు రాకుండా అన్ని దేశాలు సమైక్యతా దృక్పథాన్ని అలవరచుకోవాలి, ఆధిపత్య
ధోరణి విడనాడాలి. ప్రజలలో అసమానతలు తొలగించాలి. సరియైన న్యాయ విధానాలు అనుసరించాలి. జాతివైషమ్యాలు తొలగాలి. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండాలి. యువతీయువకుల శక్తిసామర్థ్యాలు పెడత్రోవ పట్టకుండా దేశానికి ఉపకరించేలా ప్రత్యేక పథకాలను రూపొందించాలి. ముఖ్యంగా శాస్త్రసాంకేతిక విజ్ఞానం మానవ కళ్యాణానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి. నాయకులు అధికార దాహం, స్వార్ధప్రయోజనాలు విడనాడి ప్రజల అభివృద్ధి దిశగా కృషిచేయాలి. సాంఘిక కట్టుబాట్లను, నీతినియమాలను, హింస వలన కలిగే కష్టనష్టాలను, నీతిశాస్త్రాలను, ధర్మశాస్త్రాలను, శాంతియుత పోరాటం చేసినవారి గాథలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు బోధించేటట్లుగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే భావితరాలు యుద్ధానికి తావులేని శాంతియుత జీవనాన్ని సాగిస్తాయి.