వ్యాసం
- సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువులేదు' ఈ వాక్యం
ఆధారంగా ఏదైనా కథనుగాని సంఘటనను గాని వివరిస్తూ
ఒక వ్యాగం (వాయుము.this for project work pls tell anybody
Answers
యువరాజును కాపాడిన భార్య:-
అనగనగా ఓ రాజు. ఆరాజుకు ఒక్కగానొక్క కొడుకు. ఆ రాకుమారుడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయం తండ్రితో చెప్పాడు. కొడుకు కోరికను కాదనకుండా ఒప్పుకున్నాడా రాజు. అమ్మాయితో మాట్లాడ్డానికి మంత్రిని పంపించాడు.
మంత్రి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ‘యువరాజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు’ అని తనొచ్చిన పని గురించి చెప్పుకొచ్చాడు.
‘రాజుగారి కొడుకు ఏం చేస్తాడు?’ అని అడిగింది ఆ అమ్మాయి.
‘ఆయన రాజుగారి కొడుకు. ఏ పనీ చేయడు’ బదులిచ్చాడు మంత్రి.
‘ఆయన తప్పనిసరిగా ఏదో ఒక పని చేయాలి. అలాగైతేనే నేను పెళ్లికి ఒప్పుకొంటా’ అంది అమ్మాయి.
మంత్రి రాజుగారికి, యువరాజుకి ఆమె చెప్పిన మాటలు చెప్పాడు.
యువరాజు కాసేపు ఆలోచించి ‘సరే. రకరకాల రంగుల రగ్గులు తయారుచేయడం నేర్చుకుంటా’ అన్నాడు. అన్నమాట ప్రకారం పట్టుదలగా కొద్ది రోజుల్లోనే రగ్గులు నేయడం నేర్చుకున్నాడు. దానిలో నైపుణ్యమూ సంపాదించాడు. ఆ తర్వాత ఆమె యువరాజును పెళ్లి చేసుకుంది.
ఒకరోజు యువరాజు మారువేషంలో నగర వీధుల్లో సంచరిస్తున్నాడు. చల్లగా, ప్రశాంతంగా ఉన్న ఓ చెట్టు కింద బల్లపై కూర్చున్నాడు. ‘ఎవరో ధనికుడిలా ఉన్నాడే’ అనుకుని దోపిడీ దొంగలు యువరాజును బంధించి తమ స్థావరానికి తీసుకెళ్లిపోయారు. వాళ్ల దగ్గర అప్పటికే నగరంలోని ప్రముఖులంతా ఉన్నారు.
యువరాజుకు ఏంచేయాలో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని ‘అయ్యా! నేను రకరకాల రగ్గులు తయారు చేస్తాను. అవి ఈ దేశపు రాజుగారికి చాలా ఇష్టం. ఒక్కొక్కదానికి వందల బంగారు నాణేలు ఇస్తారు. నేను నేసి ఇస్తా. మీరు ఆయనకిచ్చి బోలెడు బంగారం తీసుకోండి’ అన్ని చెప్పాడు యువరాజు.
ఈ ఆలోచన నచ్చి దొంగలు సరే అన్నారు. ఆశతో కోరిన వస్తువులు తెచ్చిచ్చారు. యువరాజు రగ్గులు నేసి ఇచ్చాడు. వాటిని దొంగలు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. వాటిని చూడగానే అవి తన కొడుకు నేసినవేనని గుర్తించాడాయన. వాటిని రాజు కోడలికి చూపించి ‘కనిపించకుండాపోయిన మన యువరాజు నేసినవే ఈ రగ్గులు ఇదిగో చూడు’ అన్నాడు.
ఆమె వాటిని పరిశీలనగా చూసింది. రగ్గు మీద దొంగల స్థావరం ఉన్న ప్రదేశాన్ని తెలిపే మార్గాన్ని చాలా నేర్పుగా అల్లాడు యువరాజు. ఆమె ఆ విషయం రాజుగారికి చెప్పింది. వెంటనే సైనికుల్ని ఆ దొంగల ముఠా స్థావరానికి పంపించాడు రాజు. ఆ దొంగలందర్నీ బంధించారు. యువరాజుతో పాటు బందీల్నీ రాజుగారి దగ్గరకు తీసుకొచ్చారు.అందరూ సంతోషించారు.
‘ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని నేర్చుకుంటే అది ఆపత్కాలంలో ఆదుకుంటుంది. నీ వల్లే నేను ప్రాణాలతో బయటపడగలిగాను.’ అన్నాడు యువరాజు తన భార్యతో.
Answer:
I didn't understand the language "sorry" ♀️♀️