రాజధాని అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి.
Answers
Answered by
12
మొదట తెలుగు భాషా పదం గా ప్రస్తావించబడిన 'నాగబు' అమరావతి ప్రాంత శాసనం లోనే లభించింది. క్రీస్తు శకం ఒకటవ శతాబ్ధికి అమరావతి మహా నగరంగా విలసిల్లింది. చంద్రగుప్తుడు, అశోకుడు కాలానికే ఆంధ్రసామ్రాజ్యం స్థిరంగా ఉంది. వారి రాజధానిగా ధాన్యకటకం, ధరణికోట అనే పేర్లతో అమరావతి ఉన్నత స్థితి లో ఉండేది.
అమరావతి శిల్పాలు గాంధార, మధుర శిల్పకళారీతులతో సమానంగా ప్రాచుర్యం పొందాయి. శిల్పకళా నైపుణ్యం లో అజరామరాఖ్యాతిని పిందింది. శాతవాహనుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరం గా విలసిల్లింది.
Similar questions