అధిక చర్యశిలత గల ములకం
Answers
Answer:
MARK ME AS BRAINLIEST ANSWER .thanks me for the reply
Explanation:
ఆవర్తన పట్టిక" అనునది రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసముల ఆవర్తన రసాయన ధర్మముల ఆధారంగా యేర్పాటు చేయబడిన ఒక అమరిక. ఈ పట్టికలో మూలకాలు వాటి పరమాణు సంఖ్య ఆరోహణ క్రమంలో అమర్చబడినవి. ఈ పట్టికలో ప్రామాణీకరించబడిన ప్రకారం 18 నిలువు వరుసలు, 7 అడ్డు వరుసలు గానూ, పట్టిక క్రింది భాగంలో రెండు ప్రత్యేక వరుసలు అమర్చబడినవి. ఈ పట్టికను నాలుగు బ్లాకులుగా విభజింపవచ్చు. వాటిలో s-బ్లాకు మూలకాలు ఎడమ వైపు, p-బ్లాకు మూలకాలు కుడి వైపున, d-బ్లాకు మూలకాలు పట్టిక మధ్య భాగం లోనూ, f-బ్లాకు మూలకాలు పట్టిక దిగువ భాగంలోనూ అమర్చబడి ఉన్నాయి.
ప్రామాణీకరింపబడిన 18 నిలువు వరుసలు గల విస్తృత ఆవర్తన పట్టిక. ఈ పట్టికలో సూచించబడిన రంగులు వివిధ వర్గాలకు చెందిన మూలకాలను తెలియజేస్తాయి.
ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అని, నిలువు వరుసలను గ్రూపులు అని వ్యవహరిస్తారు. ఈ గ్రూపులలో కొన్నింటికి హలోజనులు లేదా జడ వాయువులు వంటి పేర్లతో పిలుస్తారు. నిర్వచనం ప్రకారం ఆవర్తన ధర్మాలను కలిగియుండినప్పటికీ ఆ పట్టిక మూలకాల ధర్మములను, క్రొత్తగా వచ్చిన, ఇంకా కనుగొనబడని మూలకాల యొక్క ధర్మముల మధ్య సంబంధములను వివరించుటకు కూడా ఉపయోగపడుతుంది. ఈ పట్టిక విస్తృతంగా రసాయన శాస్త్రం, ఇతర శాస్త్రాల్లో ఉపయోగిస్తారు.
మాగ్నీషియం (ఉచ్చారణ: Mæɡni Ziəm) అనేది ఒక క్షారమృత్తిక లోహం. దీని సంకేతం Mg, దీని పరమాణు సంఖ్య 12, సాధారణ ఆక్సీకరణ సంఖ్య +2. ఇది భూమి ప్రావారములో ఎనిమిదవ విస్తారమైన మూలకం[2], విశ్వంలో గల అన్ని మూలకాలలో తొమ్మిదవది[3][4]. మెగ్నీషియం మొత్తం భూమిలో నాల్గవ సాధారణ మూలకం (దీనితోపాటు ఇనుము, ఆక్సిజన్,, సిలికాన్ ఉంటాయి). ఒక గ్రహ ద్రవ్యరాశిలో 13%, భూప్రావారంలో అధిక భాగంగా ఉంది.