అ) ప్రముఖులను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు
Answers
Answer:
ఎవరైనా ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేవారు ఎలా ప్రిపేర్ అవుతారు?
ఇంటర్వ్యూ ముద్రణ, ప్రసార మాధ్యమాల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.ప్రింట్ మీడియా కు ఒకవిధంగా, టీవీ, ఆకాశవాణిలకు వేరెవిధంగా సిద్ధ పడాల్సి ఉంటుంది.
ప్రింట్ మీడియా
ఇంటర్వ్యూ చేయాల్సిన వ్యక్తి ఏ రంగానికి చెందిన వారు అనేది గమనంలోకి తీసుకోవాలి. ఆ రంగానిమికి సంబంధించి ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు రూపొందించాలి
సదరు వ్యక్తి సాధించిన విజయాలు, అనుసరించిన విధానాలపై ప్రశ్నలు అడగవచ్చు.
ఈ సందర్భంగా ఎదురైన సవాళ్ళను ప్రశ్నించవచ్చు.
ఈక్రమంలో సహకరించినవారు,వ్యతిరేకంగా పనిచేసిన వారి గురించి అడిగితే ఆసక్తికరమైన కధనాలు చెబుతారు.
భవిష్యత్ వ్యూహాలు, ప్రణాళికలపై, ప్రశ్నించి,ఆశక్తికరమైన సమాధానం రాబట్టవచ్చు.
ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తులైతే ..ఆ స్థాయికి చేరడానికి కృషి, మార్గదర్శనం చేసినవారి గురించి ప్రశ్నించాలి.
ఎందుకు ఈ స్థాయికి చేరాలనుకున్నారు, అందుకు దోహదం చేసిన పరిస్థితుల గురించి అడిగితే , మంచి మానవీయ కథనాలు వెలుగు చూస్తాయి.
వర్తమాన సమస్యలు, పరిష్కార మార్గాలపై ప్రశ్నించవచ్చు.
ఎన్నికల సమయంలో అప్పటికి తగిన ప్రశ్నలు రూపొందించుకోవాలి.
సినీనటులు,చిత్రరంగంలో ప్రముఖులపై ప్రశ్నలు అందుకు తగినట్లు సిద్ధంచేయాలి.
ఈ విషయంలో వారి అనుభవాలు, అభిరుచులు,జీవనగమనం వంటి విషయాల్లో ప్రజలకు ఆసక్తులుంటాయి..ట్రెండ్ కు అనుగుణంగా అడిగితే ఆకర్షణీయమైన సమాధానాలు రాబట్టవచ్చు.
క్రీడాకారులు , ,ప్రభుత్వ అధికారులు, ఆధ్యాత్మిక వేత్తలు, విదేశీ ప్రముఖులు వంటివారి విషయంలో ప్రశ్నలు వేరే విధంగా సిద్ధం చేసుకోవాలి.
టీవీ, ఆకాశవాణి వంటి మాధ్యమాల్లో వేసే ప్రశ్నలు, సిద్ధం చేసుకునే సరంజామా…ఇవి వేరే సందర్భంలో చర్చించుకోవాలి.
endukante vol vol French konugolu Brahman Wala