English, asked by kathyaeenichilakala5, 6 months ago

మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వ్రాయండి​

Answers

Answered by moogalaSrivardhan
2

Answer:

సంస్కృతి (లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి.[1] ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.[2]

ఇరాన్కు చెందిన ఫర్‌హంగ్ సంస్కృతి, ఇరానియన్ నాగరికతకు చిహ్నం. పర్షియన్ సంగీతకారిణులు (అష్ట-స్వర్గాల సౌధం లోగల పెయింటింగ్ చిత్రం)

ప్రాచీన ఈజిప్ట్ కళ.

అజర్‌బైజాన్‌లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రాతి చెక్కడాలు - గోబుస్తాన్

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును.[3] ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

Explanation:

here is your answer

please make me as brainlist answer

Similar questions