డా॥
పల్లా దుర్గయ్య గురించి రాయండి?
Answers
Answer:
sorry I don't know this language
Answer:
పల్లాదుర్గయ్య కవి. సాహిత్య పరిశోధకుడు. సాహితీ విమర్శకుడు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. పట్టా పుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి. ఇతడు 1916, మే 24వ తేదీన వరంగల్లు జిల్లా,హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో పాపయ్య శాస్త్రి, నర్సమ్మలకు నాలుగవ సంతానంగా జన్మించాడు. గొట్టిముక్కల రాధాకిషన్ రావు ఇతనికి గురువు. ఇతడు 1942లో ఎం.ఎ., 1960లో పి.హెచ్.డి పట్టాపుచ్చుకున్నాడు. 1945 నుండి 1960 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు.
Explanation:
ఉస్మానియా యూనివర్సిటిలో మొట్టమొదటి సారిగా 1940లో తెలుగు ఎం.ఎ.తరగతులు ప్రారంభించారు. ఆ ఏడాది ఆ క్లాసులో చేరిన ఏకైక విద్యార్థి పల్లా దుర్గయ్య. ఒక విద్యార్థి, ముగ్గురు అధ్యాపకులు. ఆ అధ్యాపకులు రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, గంటి సేవా రామయ్యలు. ఈ విధంగా పల్లా దుర్గయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగు శాఖకు తొలి విద్యార్థి గౌరవాన్ని పొందాడు.
రచనలు:1.ప్రబంధ వాజ్మయ వికాసము (సిద్ధాంత గ్రంథము)
2.గంగిరెద్దు (కావ్యము)
3.పాలవెల్లి (ఖండకావ్య సంపుటి)
4.పారిజాతాపహరణము
5.అల్లసాని పెద్దన (విమర్శ)
6.చతుర వచోనిధి (విమర్శ)
7.పెద్దన కవితావైభవం (యువభారతి ప్రచురణ)
8.మాయరోగం (నాటకం)
9.విక్రమార్క చరిత్ర (సంపాదకత్వం - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ)
hope this is useful....