హరిశ్చంద్ర లక్షణాలను కవి ఎలా వర్ణించాడు?
Answers
Answer:
ప్రశ్న :-) హరిశ్చంద్ర లక్షణాలను కవి ఎలా వర్ణించాడు?
Explanation:
హరిశ్చంద్రుడు హిందూ రాజులలో బహుళ ప్రసిద్ధి చెందినవాడు. ఇతడు సత్యమునే పలుకవలెనని అబద్దము చెప్పరాదనే నియమము కలిగినవాడు.
హరిశ్చంద్ర లక్షణాలను కవి ఇలా వర్ణించాడు :-)
హరిశ్చంద్రుడు అయోధ్య రాజధానిగా పాలించిన సూర్యవంశ చక్రవర్తి. సూర్యవంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టినవాడు. గొప్పదాత. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. సముద్రమంత దయగలవాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. సత్యవాక్పరిపాలకుడు. ఆడినమాట తప్పనివాడు. వశిష్ఠుడు చెప్పినట్లు బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతము కుంగిపోయినా, ఆకాశం ఊడి కింద పడినా, సముద్రం ఎండినా, భూగోళం తలకిందులయినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.
హరిశ్చంద్రుడు సూర్యవంశస్థుడు. నీతిపాలకుడు. నిత్య ప్రసన్నుడు. మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేస్తూ ఆనందించేవాడు. వినయ వివేక సంపన్నుడు. కీర్తిమంతుడు. ధనుర్విద్యావేత్త. కరుణాపయోనిధి. గంభీరుడు. పుణ్యాత్ముడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. పండితుల స్తోత్రములకు పాత్రుడు. శత్రుజన భయంకరుడు. షట్చక్రవర్తులలో ఒకడు. సత్యసంధుడు. త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు. విజ్ఞాన నిధి. అబద్ధం ఎరుగనివాడు. రెండువేల నాలుకలు ఉన్న ఆదిశేషుడికి కూడా హరిశ్చంద్రుని గుణములను కీర్తించడం అసాధ్యము.