"మీ ఊరి నుండి ఎవరైనా నగరాలకు వలస వెళ్ళారా? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? వాళ్ళు అక్కడ ఏం
చేస్తున్నారు?
గురించి రాయండి.
Answers
Answer:
HOPE IT HELPS............
Answer:
మా ఊరి నుండి ఎంతోమంది యువతీయువకులు, వివిధ చేతి వృత్తులవారూ, బ్రాహ్మణులూ హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళారు
Explanation:
వలస వెళ్ళడానికి కారణాలు : మా గ్రామం పేరు శ్రీరంగపురం, కృష్ణానదీ పరివాహక ప్రాంతం. మా గ్రామంలో ప్రజలకు సరైన ఉపాధి సౌకర్యాలు లేవు. విద్యా, వైద్య సదుపాయాలు లేవు. ఇక్కడి వారికి ఉద్యోగాలు దొరకలేదు. అందువల్ల వారు హైద్రాబాద్ నగరానికి వలసపోయారు. మా గ్రామంలో వ్యవసాయం వారికి గిట్టుబాటు కానందున, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, కూలి పనులకోసం, తాపీ, వడ్రంగం వంటి వృత్తుల వారు సైతం నగరాలకు వలస వెళ్ళారు. మరికొందరు యువకులు, సినిమా పరిశ్రమలో చేరి, తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొని, నటులుగా, కళాకారులుగా అభివృద్ధి చెందాలని, నగరానికి వలస వెళ్ళారు.
కొందరు యువకులు నగరాల్లో కూలి పనులు చేస్తున్నారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు లఘు పరిశ్రమలు పెట్టారు. కొందరు బ్రాహ్మణులు గుళ్ళలో పూజారులుగా, పురోహితులుగా పనిచేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన చేతివృత్తులు చేసుకుంటూ, అపార్ట్ మెంట్ల వద్ద కాపలాదార్లుగా పనిచేస్తున్నారు.
ఇంజనీరింగ్ చదివిన యువతీయువకులు నగరంలో శిక్షణ పొంది, చిన్న, పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వంలో ఉద్యోగులుగా, ప్రైవేటు పరిశ్రమలలో కార్మికులుగా, కొందరు నిరుద్యోగులుగా ఉంటున్నారు. కొందరు వైద్యశాలల్లో నర్సులుగా పనిచేస్తున్నారు.