దశరధుని పాత్ర స్వభావం గురించి రాయండి
Answers
Answer:
దశరథునికి శబ్దబేది విద్య తెలుసు. శబ్దబేది అంటే శబ్దం వినిపించిన వైపుకు గురి చూసి బాణాన్ని ప్రయోగించడం. ఒకరోజు దశరథ మహారాజు వేటలో ఉండగా జింక నీళ్ళు తాగుతున్నట్లు ఒకవైపు నుంచి శబ్దం వినవచ్చింది. దశరథుడు ఆలస్యం చేయకుండా శబ్దం వచ్చిన వైపుకు బాణాన్ని వదిలాడు. కానీ ఆ బాణం దురదృష్టవశాత్తూ తన అంధ తల్లి తండ్రులకు దాహార్తిని తీర్చడానికి నీళ్ళ కోసం వచ్చిన శ్రవణ కుమారునికి తగిలి దశరథునికి తానెవరో చెప్పి అక్కడికక్కడే మరణించాడు. తన చివరి కోరికగా తన తల్లిదండ్రుల దాహం తీర్చమని కోరాడు. శ్రవణ కుమారుని వృద్ధ తల్లిదండ్రులకు దాహార్తిని తీర్చిన పిదప, జరిగిన ఘోరాన్ని వారికి విన్నవించాడు. పుత్రశోకం తట్టుకోలేని ఆ తండ్రి దశరథుడు కూడా ఏదో ఒక రోజు పుత్రశోకం అనుభవించక తప్పదని శపించి ఆ పుణ్య దంపతులిద్దరూ ప్రాణాలు విడిచారు. ఆ శాపం ప్రకారమే దశరథుడు తన కుమారుడు రాముడు అడవికి వెళ్ళేటపుడు పుత్రశోకం భరించలేక కన్నుమూశాడు.
Explanation: