పద్యాల వల్ల ఉపయోగాలు మనం ఏమినెర్చుకొవచ్చు. సొంతమాటలలో రాయండి?
Answers
ఉత్పల మాలికల కన్నింటికి యతి గణ ప్రాసలు ఒక్క విధంగానే ఉంటాయి. కానీ, ఆ మాలిక యెత్తుగడలో, ముగింపులో, విరుపులో చూపించే వైవిధ్యము, వైచిత్రి చేత అది ఒకొక్క విశిష్టశక్తిని సంతరించుకుంటుంది. సీసములు, కందములు కూడా ఇట్లాగే పెంపొందింపబడ్డాయి. సంస్కృత సమాస కల్పనమే శిల్పం కాదు. సందర్భ స్వభావానుకూలంగా ప్రదర్శించే ఉత్కృష్ట నిర్మాణ చాతురీ విశేషమే శిల్పం అవుతుంది.
Answer:
ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.[1]