కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మాటే ప్రధానం' దీనిపై మీ అభిప్రాయం రాయండి.
ఆ) 'శాస్త్ర మర్యాదలకు లోబడిన వాక్కు 'పవిత్రమైనది' ఇట్లా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
తెలంగాణ ప్రభుత్వంచే ఉచిత పంపిణీ 2020-21
Answers
నేను కూడా బాగున్నాను.
I am fine...
Answer:
1)మనం మాట్లాడగలుగుతున్నాం కాబట్టి మనకు విలువ 'తెలియదు. ఒక మూగవాడిని చూస్తే అప్పుడు మనకు | మాత విలువ తెలుస్తుంది. మన మనసులో ఉన్న 'భావాన్ని ఆలోచనలను ఎదుటి వారికి వ్యక్త పరచాలంటే మాట అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక మాట 'లేకపోతే పాటలు లేవు, కవిత లేదు, నవ్యత లేదు, జాగృతి లేదు అని శ్రీవేముగంటి నరసింహాచార్యులు. మాటకున్న శక్తియుక్తులు అంతా ఇంతాకావు. మనిషికి చదువు లేకపోయినా, శారీరక బలం లేకపోయినా, ధనం లేకపోయినా మంచి మాట ఉంటే మనిషి బతకగలదు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని "సామెత వచ్చింది. దీన్ని బట్టి మాటకున్న ప్రాధాన్యం తెలిసిపోతుంది. అది ఎంతటి వారినైనా నొప్పించగలదు. మెప్పించగలదు. ఆపదల నుంచి తప్పిస్తుంది. సమస్యాపరిష్కారం మాటతోనే సాధ్యమవుతుంది. మన | మాటను బట్టి మన సంస్కారం తెలుస్తుంది. ఇన్ని మనం మాట ద్వారానే సాధించగలుగుతాం. మంచి మాట |ద్వారా జీవితంలో ఏదైనా తప్పక సాధించగలం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
2)భారతీయులు వాక్కును దేవతగా భావిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించటం పుణ్యమన్నారు. శాస్త్ర మర్యాదలకు లోబడిన వాక్కును పవిత్రమైన వాణిగా గుర్తించారు. వాక్కును దేవతగా పూజించే మనకు శాస్త్రమర్యాదలకు లోబడిన వాక్కును పవిత్రంగా భావిస్తాం. వాక్కు మన సంస్కృతి వేద సంప్రదాయాన్ని గౌరవిస్తుంది. వేదు ప్రమాణమైన మాటకు గౌరవం ఉంటుంది.. పరిశుద్ధం, పవిత్రం, మృదు మధుర, శాస్త్ర మర్యాదకు లోబడిన వాక్కునుపయోగించ గలవాడు ధన్యుడు. భాష పవిత్రమైనది. కాబట్టి దాన్ని శాస్త్ర సమ్మతంగానే మాట్లాడాలి. వాక్కు మనిషికి అలంకారం. ఎన్నడూ ఉడిగిపోని అలంకారం. చక్కని భాషలేనివాడు ఎంత చక్కని వేషమేసినా వ్యర్ధమే. వాగ్ధార కత్తిమొన కంటే పదునైనది. అందుకే వేముగంటి నరసింహాచార్యులు విశ్వాన్ని నడిపించేది వాక్ఛక్తి అన్నారు. చక్కటి భాష, చక్కని వాక్కు లేనివాడు దరిద్రుడితో సమానుడే! నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని పెద్దల వాక్యం. చక్కగా మాట్లాడే వారిని అందరూ గౌరవిస్తారు. అందుకే "వాగ్భూషణం భూషణం" అన్నారు కవి.