India Languages, asked by itzHitman, 3 months ago

రైతు గొప్ప తనాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.​

Answers

Answered by madhuaashu555
9

Answer:

raitu mana kadupu nimputadu. raitu ni karshakudu mariyu annadata ani kuudaa antaaru. raitu pandinchina dhaanyam srama tho kuudinadi .thana raktamu kuudaa chamata la chesi polamu dunnutadu .

Explanation:

please convert it into telugu and write

rate five stars and thanks me

Answered by mekalakrishnampl
8

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకునే ఉద్యోగులను రైతుకూలీలు అంటారు.

మన దేశంలో రైతు పడుతున్న కష్టాలను చూసి ఎందరికో మనసు చివుక్కుమంటుంది. బలవన్మరణాల వార్తలు చదివి ఎందరి కళ్లో వర్షిస్తాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కానీ అందరిలా అలా బాధతో సరిపెట్టుకుని చూస్తూ ఊరుకోలేకపోయారు పాలట్ విజయరాఘవన్. ఆయనది ఊటీ. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి రమణీయత, పచ్చదనం పరుచుకున్న కొండలు వంటి ఎన్నో ప్రత్యేకతలతో ఉండే ఊటీ అందాలు ఆయన్ను ఆకట్టుకోలేదు. పచ్చని పొలాల్లో పనిచేసే రైతులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఆయన మనసును తట్టాయి. రైతుల బాధలను అనునిత్యం ప్రత్యక్షంగా గమనించటం ఆయన హృదయాన్ని కలిచివేసింది. అందుకే రైతులకు ఏదన్నా చేయాలని బలంగా కోరుకున్నారు. ఆ ఆలోచనలోనుంచి పుట్టుకొచ్చిందే లారెన్స్ డేల్ అగ్రో. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్నింటినైనా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే పాలట్ విజయరాఘవన్ లారెన్స్ డేల్ అగ్రో స్థాపించారు. అనేక దశల్లో వ్యవసాయం ద్వారా చిన్న, సన్నకారు రైతులు సాధికారత పొందేలా చేయాలన్నది ఆయన కోరిక. ఇది మరో సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తుంది. వ్యవసాయరంగంలో ఉపాధి దొరక్క నగరాలకు వలస బాట పడుతున్న పల్లె జీవుల కష్టానికి అడ్డుకట్ట వేస్తుంది.

hope it helps uh.....

Similar questions