రాయప్రోలు సుబ్బారావుగారిని మీ మాటల్లో పరిచయం చేయండి?
కింది ప్రశ్నలకు పదేసి పంక్తులలో సమాధానం రాయండి
Answers
Explanation:
ఆధునిక నవ్యాంధ్ర కవి రాయప్రోలు సుబ్బారావు (1892 – 1984) తెలుగు సాహిత్య ప్రక్రియ లో మూడు కొంగ్రత్త కోణాలను ఆవిష్కరించాడు.
(1)భావ కవిత్వ ప్రక్రియ :- కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో యూరప్లో, ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో వికసించిన భావుకత చిత్రకారులను, రచయితలను, శిల్పులను, కవులను వారివారి కళా ప్రక్రియల్లో గట్టిగా ప్రభావితం చేసింది. పాశ్చాత్య దేశాల్లో వెల్లి విరిసిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. అయితే ఈ ప్రక్రియను ఆయన గుడ్డిగా అనుకరించ లేదు. మన సమాజ పోకడలకు అనుగుణం గా భావుకతను అల్లి తెలుగుకవితకు క్రొత్త సొగసులు అద్దాడు. సంస్కృత రచనలపై అధికంగా ఆధారపడ్డ తెలుగు కవిత్వానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాడు.
(2)ఖండ కావ్య ప్రక్రియ:- రాయ ప్రోలుకి ముందుగా తెలుగులో ఖండకావ్యం లేదనే చెప్పాలి. వ్యాకరణ కట్టు బాట్లు అతిగా లేకుండా జనబాహుళ్యానికి దగ్గరగా చిన్నచిన్న పదాలతో తక్కువ నిడివి తో అల్లిన కవితలే ఖండ కావ్యం గా చెప్పుకోవచ్చు. 1913లో రచించిన ఖండకావ్యం ‘తృణకంకణం’తో తెలుగులో నూతన శకానికి అంకురార్పణ చేసాడు రాయప్రోలు.
(3)అమలిన శృంగారం :- ప్రబంధ కవులు అంగాంగ వర్ణన తో స్త్రీని శృంగార సాధనంగానే అభివర్ణించారు. ప్రేమకి పరాకాష్ట స్త్రీపురుష సంభోగమే అనే చింతనను కలిగించారు వారి రచనల ద్వారా. దీనికి భిన్నంగా రాయప్రోలు వియోగ శృంగారాన్ని ఆవిష్కరించాడు తన ‘తృణకంకణం’తో. ఎడబాటు మరింత ప్రేమకు దారి తీస్తుందని అలాంటి ప్రేమలో శారీరక సంపర్కం కంటే ఆత్మల సంయోగమే గొప్పదని చెప్పాడు. దానినే రాయప్రోలు ‘అమలిన శృంగారం’గా అభివర్ణించాడు. కామాన్ని, ప్రేమని శృంగారం గానే భావన చేసాడు రాయప్రోలు. ఈ సిద్దాంత ఉద్దీపనకు భారతీయ కవుల కావ్యాల తోపాటు, శంకరాచార్యుల సౌందర్య లహరి, భారతీయ ఇతిహాసాలు, ఉపనిషత్తుల సారంతో బాటు, పాశ్చాత్య రచనల ప్రభావం వుందని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. ‘మేఘ సందేశం’లో వియోగం లోనే ప్రేమ విలసితమని కాళిదాసు చెప్తాడు. భవభూతి తన ‘ఉత్తర రామ చరిత్ర’ లో కాలం గడిచే కొద్దీ భార్యాభర్తల సంబంధం శారీరక సంయోగానికి ప్రాధాన్యత లేని మధురమైన స్నేహంగా మార్పు చెందుతుందని చెబుతాడు.