సీతాపహరనం గురించిన రాయండి
Answers
Answer:
Hope this helps you ☺️
జటాయువు తన శక్తి వంచనలేకుండా పోరాడి, రెక్కలు తెగి నేలపడడం చూసి సీత శోకంతో అలమటించింది. జటాయువును అక్కున చేర్చుకుంది. ‘రామా! లక్ష్మణా!’ అంటూ ఆక్రోశించింది . రావ ణుని నుంచి తప్పిం చుకోవడానికి ఒక చెట్టును గట్టిగా పట్టుకున్నది. రావణుడు సీతను తీసుకుని ఆకాశానికి ఎగిరాడు.
శ్రీమహావిష్ణువు రామావతార లక్ష్యం నెరవేరబోతున్నదని బ్రహ్మ సంతోషించాడు. దండకారణ్యంలోని ఋషులు రావణుని క్రూర కృత్యాన్ని చూసి మథనపడ్డారు. రావణ సంహారానికి సమయం దగ్గ్గరయిందని సంతోషించారు. రావ ణుడు సీతను ఆకాశమార్గాన కొనిపోతుండగా, నల్లని మేఘం నుంచి మెరుపు తీగ వలె సీత మెరిసింది. పెనుగులాటలో సీత కొప్పు నుంచి జారిన పూరేకులు నేల మీద చెల్లా చెదురుగా పడ్డాయి. సీత ఆభరణాల ముక్కలు నేలరాలిపడ్డాయి. ఆమె కాలి అందె, మెడలోని హారం జారిపడిపోయాయి.
రావణుడు విసురుగా వెళుతుండడం వల్ల్ల చెట్ల చిటారు కొమ్మలు కదిలాయి. వాటిపై పక్షులు కిలకిలారావాలు చేశాయి. చెట్లు తల ఊపి, భయపడవద్దు అని ఓదార్చుతున్నట్లు అనిపించింది. మృగాలు మోరలు సాచి, సీతాదేవికై దు:ఖిస్తూ వెంబడించాయి. సీత నిత్యమూ పచ్చిక నోటికి అందిస్తూ పెంచిన జింక పి ల్లలు కన్నీటి పర్యంతమయ్యాయి. రక్షించే వారు కరువై, కన్నీరు విడుస్తూ సీత క్రుంగిపోయింది.