World Languages, asked by ragisujatha76, 4 months ago

కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి.​

Answers

Answered by lucky66686
3

Answer:

త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి

Explanation:

త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. త్యాగం చేయడం వల్ల ఎంతో ఆనందం ఉంటుంది. త్యాగం చేయటం ద్వారా వచ్చే అనుభూతి అనుభవిస్తూ గానీ దాని విలువ తెలీదు . అన్ని గుణాలు లో త్యాగగుణం చాలా గొప్పది. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. త్యాగం చేయటానికి నిస్వార్ధ గుణం మరియు సేవా భావం చాల అవసరం. ఎందరో వీరులు స్వాతంత్య్రానికి తమ జీవితాన్ని త్యాగం చేశారు. అలాగే తల్లి తన పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. త్యాగం చేయటంలో ఉండే ఆనందం తల్లికి తెలుసు కాబట్టి. తమ దగ్గర ఉన్నదంతా ఇతరులకు ఇచ్చి వారు ఆనంద పడుతున్నారు. అదే త్యాగం లో ఉన్న గొప్పతనం. మానవ సేవా మాధవ సేవా అన్నారు. అందుకని భగవంతుడు తో సమానంగా తోటి మానవాళి కి కూడా మనం సేవా చేయాలి. సేవా మరియు త్యాగం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం.

Similar questions