నెమలి ఈకలతో ఏం చేస్తారు?
Answers
Answer:
నులు ఆలస్యమవుతుంటే : గ్రహాలు కలిసిరాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. ఐతే, ఇంట్లోని బెడ్‌రూంలో తూర్పువైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈకను ఉంచితే... అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
ఏకాగ్రత పెరగడానికి : పిల్లలకు నెమలిపించం ఇస్తుంటారు. ఇది మంచి పని. ఎందుకంటే... పుస్తకాల్లో నెమలి పించంను ఉంచడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందట. చదువుల్లో వెనకబడే చిన్నారులు, చదివింది వెంటనే తలకెక్కని పిల్లలు తమ పుస్తకాల్లో చిన్న చిన్న నెమలి పించాలు ఉంచుకుంటే... అవి వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయన్నది పండితోత్తముల మాట.
వాస్తు దోష నివారణకు : నెమలి పించం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుందట. ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతోపాటూ... ఓ నెమలి ఈకను ఉంచాలి. ఇది వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాదు... ఇంటి చుట్టుపక్కల నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తులు)ని కూడా తరిమికొడుతుందట.
గ్రహ దోష నివారణకు : జన్మదినం, పుట్టిన సమయం, ప్రదేశం వంటి వాటి వల్ల కొన్ని సార్లు గ్రహ దోషాలు వెంటాడుతుంటాయి. అవి లేనిపోని సమస్యలు తెస్తుంటాయి. వాటికి చెక్ పెట్టాలంటే, నెమలి పించం కావాల్సిందే. దానిపై కొద్దికొద్దిగా నీరు చల్లుతూ జ్యోతిష్యులు చెప్పినట్లుగా 21 సార్లు మంత్రాలు చదవాలి. ఆ తర్వాత ఆ నెమలి పించాన్ని పూజ గదిలో రోజంతా ఉంచాలి. తర్వాతి రోజు నీటిలో ముంచాలి. ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
Explanation: