జంతువులు మరియు పక్షుల పట్ల ప్రేమ మీద వ్యాసం
Answers
Answer:
mark me asa brainlist
Explanation:
పక్షులు (ఆంగ్లం Birds) రెండు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. తెలుగు భాషలో పక్షి పదానికి వికృతి పదము పక్కి. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (ornithology) అంటారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం నిర్వహించబడుతుంది.
పక్షులు అంతరోష్ణ లేదా ఉష్ణ రక్త జీవులు.
ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి.
ఒక మనిషి జంతువుల మీద దయ చూపించినంత మాత్రాన వారు కోల్పోయేది ఏమీ ఉండదు.
వేసవి రానే వచ్చింది .కానీ అది ఒంటరిగా రాదు . సెలవులను కూడా తనతో తీసుకు వస్తుంది .పిల్లలు ఇంటి చుట్టూ పరిగెడుతూ ,ఆడుకుంటూ మరియు మీరు ఎన్నో సంవత్సరాలుగా దాచుకుంటూ వస్తున్న వస్తువులను పగలగొట్టడం, మరియు వారితో పాటుగా మండే సూర్యుడు కూడా మనకు చెమటలు పట్టించేస్తుంటారు .ఈ వేసవిలో మనము ఎయిర్ కండిషన్లు మరియు కూలర్లను ఇంటి చుట్టూ ఉంచుకొని సౌకర్యవంతంగా గడుపుతాము .కానీ మనలాంటి సౌకర్యవంతమైన వేసవిని పొందలేని ఇతర జీవులు మన చుట్టూ ఉన్నాయి . జంతువులు కూడా మన వాతావరణంలోని అంతర్భాగము .అవి లేకుండా మన జీవితాలను కొనసాగించడం కష్టతరం .అవి మనలాగే వేసవిని ఆశ్వాదించలేక పోవడం సిగ్గుచేటు.
జంతువుల పట్ల చొరవ మరియు దయ చూపించండి
వాటికి ప్రేమ మరియు ఆప్యాయతలను పంచడానికి ఇది మంచి సమయం అని నేను అనుకుంటున్నాను . కేవలం మనం మనుషుల మీద మాత్రమే కాకుండా అన్ని జీవుల యందు దయ చూపించవలసిన అవసరం ఉంది . చొరవ తీసుకోండి మరియు మీ పిల్లలకు జంతువుల పట్ల దయను నేర్పండి.
దత్తత తీసుకోండి. కొనకండి
ఈ వేసవిలో మీ బిడ్డ ఒక పెంపుడు జంతువు కావాలని అడుగుతున్నాడు .దత్తత తీసుకోవడాన్ని ఎంచుకోండి .ఒక కుటుంబము మరియు ఇల్లు అవసరం అయిన ఒక పెంపుడు జంతువు యొక్క అవసరాన్ని మీరు తీర్చవచ్చు . ఒక జంతువుకు కుటుంబాన్ని ఇవ్వడం ద్వారా అవి ఎంత మంచి చేస్తాయో మీ పిల్లలకు వివరించి చెప్పండి.
నివసించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రదేశం
ఎండ నుండి కాపాడుకోవడానికి జంతువులు రోజంతా ఒక స్థలం కోసం వెతుకుతూ ఉంటాయి . వాటికి ఎండ నుండి రక్షించుకునే తాత్కాలికమైన నివాసాన్ని ఇవ్వండి.మీ ఇంటి వెలుపల షెడ్ కింద పిల్లి గాని కుక్క గాని పడుకోవడం చూచినట్లయితే , వాటికి భంగం కలిగించ వద్దు మరియు అవి పారిపోయేలాగా చేయకూడదు అని మీ పిల్లలకు నేర్పండి.
వాటికి ఆహారాన్ని పెట్టండి
మీ పిల్లలలో దయగా ఉండాలి అనే విషయమును బోధిస్తూ ఉండండి. కుక్కలకు పిల్లులకు మరియు కఠినమైన జంతువులకు ఆహారాన్ని (మీ సమక్షంలో) పిల్లల చేత పెట్టించండి. పక్షులకు నీళ్ల గిన్నెలు నింపడం లోనూ ,ఆహారం పెట్టే విషయంలోనూ మీ పిల్లల సహాయం తీసుకోండి.
వాటిని దాహంతో ఉంచకండి
మనందరికీ నీరు ఎంతో అవసరం. ఎల్లప్పుడూ మీ ఇంటి వెలుపల జంతువుల కొరకు నీళ్లు నింపిన బకెట్ లను ఉంచండి . మరియు పక్షుల కోసం నీటితో నింపిన గిన్నెలను బయట ఉంచడం ఎంతో మంచిది .వాటిని ఎప్పుడూ నీటితో నింపమని పిల్లలకు తెలుపండి .వీటి ప్రాముఖ్యతను పిల్లలకు ఎల్లప్పుడూ తెలియ చెప్పండి.
జంతువులను వేధించకండి
కొన్నిసార్లు మీ పిల్లలు చెడు పనులు చేయడానికి ప్రయత్నిస్తారు.పిల్లలు వినోదం కోసం కుక్కలను ,పిల్లులను ఏవిధంగానైన వేధిచవచ్చు అనే దానిపై ఎన్నో కథలు కూడా ఉన్నాయి. మీ పిల్లలకు అటువంటి పనులు చేయకూడదు అని నేర్పించండి.
జంతువుల పట్ల కరుణ చూపించేలాగా పిల్లలకు నేర్పించే వలసిన విషయాలు
ఈ చిన్న చిన్న విషయాలు జంతువుల విషయంలో మాత్రమే కాదు .మీ పిల్లల జీవితంలో కూడా చాలా మార్పులను తీసుకు వస్తాయి .జంతువుల పట్ల చూపే కనికరం మనుషుల పట్ల కూడా చూప కలుగతారు. మీ పిల్లలు నోరు లేని మూగజీవుల తోనే అంత మంచిగా ఉండగలిగితే ,మనుషులతో మరెంత మంచిగా ఉండగలరు ! ఆలోచించండి . దయ అనేది చెవిటివాడు వినగల మరియు గుడ్డివారు చూడగల భాష . దాని ప్రతిఫలం అనేది ఎల్లప్పుడూ తిరిగివచ్చే బూమెరాంగ్ అనే ఆయుధం లాంటిది.
ఈ బ్లాగు మీకు నచ్చిందా ?ఉపయోగకరంగా ఉందా ? క్రింద కామెంట్ విభాగంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి .మీ ఆలోచనలను వినడానికి మేము ఎంతో ఇష్టపడతాము.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు