తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు వెళ్తున్నారు
Answers
Answer:
గల్ఫ్ దేశాల్లో గత ఆరేళ్లలో 35,748 మంది భారతీయ వలస కార్మికులు మరణించారు. వారిలో రెండు వేల మందికి పైగా తెలుగు రాష్ట్రాల కార్మికులున్నారు. 2019 నవంబరులో లోక్‌సభకు విదేశీ వ్యవహారాలశాఖ ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం ఉంది.
ఈ గణాంకాలు గల్ఫ్ వలస కార్మికుల సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. గల్ఫ్ దేశాలతో చర్చల్లో వీరి గురించి కూడా చర్చించాలని కేంద్ర ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు.
భారతీయులు ఏయే దేశాలకు వెళ్తారు?
పాక్షిక నైపుణ్యమున్నవారు, లేదా నైపుణ్యంలేని కార్మికులు కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్, యూఏఈ లాంటి దేశాలకు ఎక్కువ మంది వెళ్తున్నారు.
విదేశీ వ్యవహారాల లెక్కల ప్రకారం 2018 డిసెంబరు నాటికి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నవారు, నివసిస్తున్నవారు కలిపి 85 లక్షల మంది భారతీయులు ఉన్నారు.
2014 నుంచి 2018 మధ్యలో 28 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఇమిగ్రేషన్ అనుమతులు పొందారు.