India Languages, asked by nagarajukarri5, 4 months ago

మీకు తెలిసిన ముగ్గురు శతక కవులు వారు రాసిన పద్యాలను సేకరించండి ​

Answers

Answered by Anonymous
1

Explanation:

శతకము (Sathakamu) అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.

ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.

Answered by sarithajulakanti112
6

Answer:

1. వేమన :-

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

కొంచమైనా నదియు కొదువ కాదు

విత్తనంబు మర్రివృక్షణంబునకు నెంత

విశ్వదాభి రామ వినురవేమ !

2. బద్దెన :-

ఉపకారికి నుపకారము

విపరీతము గాదు సేయ, విపరీంపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి !

3. మారయ్య వెంకయ్య :-

చదువది ఎంత కల్గిన రస

జ్ఞత ఇంచక చాలకున్న న చదువు

ని రర్ధకంబున్ బదునుగా మంచి

కూరాచేసిననైననందు నుప్పులేక

రుచి పుట్టగ నేర్చునయ్య భాస్కర !

Similar questions