World Languages, asked by yashwanthgoudyogi11, 4 months ago

గాలి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులేవి ?​

Answers

Answered by prabhas24480
5

\Large{\red{\underline{\underline{\tt{AnSweR:}}}}}

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును.

ఇంధన వాయువు నుండి గంధకమును తీసివేయు ప్రక్రియ (flue gas desulfurization) స్థాపించక పూర్వము న్యూ మెక్సికో (New Mexico) లోని ఈ పవర్ ప్లాంట్ నుండి వెలువడు వాయువులలో సల్ఫర్ డై ఆక్సైడ్ (sulfur dioxide) అధికముగా మిళితమై ఉండేది.

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది. వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియరులో ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యానికే కాక భూమియొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ప్రతి ఏటా వాయుకాలుష్యం వలన 2.4 మిలియన్ల జనం మరణిస్తున్నారు. అందులో 1.5 మిల్లియన్లు భవనాల లోపలి కాలుష్యం వలన.[8]"రోగాల పూర్వాపరాలను గురించి చెప్పే శాస్త్ర (Epidemiological) పరిధిలోని అధ్యయనాలు, ఏటా 5,00,000 కంటే ఎక్కువ మంది అమెరికన్లు కార్డియోపల్మోనరీ (cardiopulmonary) వ్యాధి బారిన మృతి చెందుతున్నారని తెలుపుతున్నాయి. ఈ వ్యాధి రేణువుల వాయు కాలుష్యం (fine particle air pollution) తో . . ."[9]బర్మింగ్ హాం యునివర్సిటీ (University of Birmingham) చేసిన ఒక అధ్యయనం ఊపిరితిత్తు ల వాపుతొ కూడిన వ్యాధి నిమోనియా (pneumonia) మృతులు, మోటారు వాహన కాలుష్యం మధ్య ఉన్న దగ్గరి సంబంధాన్ని చూపిస్తుంది.[10] ఏటా ప్రపంచం మొత్తం మీద మోటారు వాహనాల వలన సంభవించే మరణాల కంటే ఎక్కువ వాయు కాలుష్యం వలన జరుగుతున్నాయి. 2005 ప్రచురింపబడి ఏటా 310000 యూరోపియన్లు వాయు కాలుష్యం వలన మరణిస్తున్నారని చెబుతుంది.తీవ్రమైన ఉబ్బసం ఆస్తమా, రొమ్ము పడిశం బ్రోన్కైటిస్, ఏమ్ఫీసేమ, ఊపిరితిత్తుల, గుండె సంబంధిత జబ్బులు, ఊపిరి సంబంధిత అల్లెర్జీలు మొదలైనవి వాయు కాలుష్యం వలన ప్రత్యక్షంగా ఏర్పడే మ్రుత్యువులకు కారణాలు.యు ఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (US EPA) అంచనాల ప్రకారం డీసెల్ (diesel) ఇంజన్ టెక్నాలజీ లో (టైఏర్ - 2) ప్రకారము మార్పులను చేస్తే ఏటా అకాల మరణాలను 12000 తగ్గించవచ్చు, 15000 తక్కువ గుండె పోటు (heart attack)లు, 6000 వరకు పిల్లలు ఉబ్బసం (asthma) వలన తక్షణ చికిత్సా కక్ష్య (emergency room)కు చేరే కేసులను, 8900 వరకు ఊపిరికి సంబంధించి హాస్పిటల్లో చేరే కేసులను యునైటెడ్ స్టేట్స్ లో తగ్గించవచ్చు.

ఇండియా (India) లో 1984 లో జరిగిన భోపాల్ అనుకోని ఆపద (Bhopal Disaster) తక్కువ కాలపు ప్రబ్చావం కలిగిన అతి భయంకరమైన పౌర సంబంధమైన కాలుష్య ప్రమాదం.[11] యూనియన్ కార్బైడ్ కం., యు ఎస్ ఎ, వారి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి లీకైన పారిశ్రామిక వాయువులు తక్షణం 2000 మందిని పొట్టన పెట్టుకున్నవి, 150000 నుండి 600000 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 6000 మంది తరువాత మృత్యువ బారిన పడ్డారు.యునైటెడ్ కింగ్డం చరిత్రలో అత్యంత భయంకరమైన కాలుష్య సంఘటనా లండన్ (London) పై డిసెంబరు 4 (December 4) 1952 న ఏర్పడిన మహా స్మోగ్ (Great Smog of 1952) రూపంలో జరిగింది.కేవలం 6 రోజులలో 4000 మంది చనిపోయారు, తరువాతి మాసాలలో 8000 పోయారు.1979 లో యు ఎస్ ఎస్ ఆర్ (USSR) లోని స్వేర్ద్ లోవ్స్క్ (Sverdlovsk) దగ్గరి ఒక బయలాజికల్ ఆయుధాలను (biological warfare) తయారు చేసే లాబొరేటరీలో జరిగిన ప్రమాదం లో లీక్ అయిన ఆంత్రాక్స్ (anthrax) స్పోర్ల వలన వందలమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా (United States of America) లో నేటి వరకు అతి పెద్ద కాలుష్య ప్రమాదము 1948 సంవత్సరం అక్టోబరు చివర్లో దోనోర, పెన్న సిల్ వానియా (Donora, Pennsylvania) లో జరిగింది. దీనివలన మొత్తం 20 మంది మృతిచెందగా 7000 పైగా క్షతగాత్రులయ్యారు.[12]

గాలి లోని కాలుష్యాలు ఆరోగ్యం పై చూపెట్టు ప్రభావాలు కనిపించని జీవరసాయనిక, శారీరక మార్పుల నుండి మొదలుకొని ఊపిరి ఆడకపోవుట, రోప్పుట, దగ్గుట, ఊపిరి, గుండె సంబంధిత అనారోగ్యాలను తీవ్రతరము చేయుట వరకు ఉంటాయి.వీటివలన మందుల వాడకం, డాక్టర్లను కలవటం లేక తక్షణ చికిత్స చేయించు కొనుట, హాస్పిటల్లలో చేరుట, అకాల మరణాలు పెరుగును.మానవ ఆరోగ్యం పై చెడు లక్షణాలు కల గాలి చూపే ప్రభావము చాలా రకాలు, కాని ఎక్కువగా అది శరీరంలోని ఊపిరితిత్తుల వ్యవస్థను, రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.వాయు కాలుష్యం యొక్క వ్యక్తిగత ప్రభావాలు ఆ వ్యక్తి పై ఎటువంటి కాలుష్యం, ఎంత సమయము పనిచేసింది, ఆ వ్యక్తి యొక్క పూర్వారోగ్యము, వంశ పారంపర్యము మొదలైన అంసములపై ఆధారపడతాయి.

సదరన్ కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెల్స్ బేసిన్ (Los Angeles Basin), సాన్ జోఅక్విన్ లోయ (San Joaquin Valley) లోని వాయు కాలుష్యము, ఆరోగ్యము పై దాని ప్రభావము గురించి చేసిన ఒక ఎకనామిక్ అధ్యయనం ప్రకారం ఫెడరల్ ప్రమాణాలను అతిక్రమించే వాయు కాలుష్యముల వలన ప్రతి ఏడు 3800 మంది అకాల మరణం చెందుతున్నారు (మామూల కంటే సుమారు 14 ఏళ్ళు ముందుగా).ఈ ప్రదేశంలో ఏటా జరిగే అకాల మరణాల సంఖ్యా ఆటోమొబైల్ యక్సిదేంట్ల (ఏటా సరాసరి 2000 వరకు) వలన జరిగే వాటి కన్నా గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి.[13]

Similar questions