ఇంటికి వచ్చిన అతిథిని ఎలా ఆదరించాలి? మీ సొంతమాటల్లో రాయండి
Answers
Answered by
1
భారతీయ సంప్రదాయంలో కంటికి కనిపించని ముక్కోటి దేవతలున్నారు. మనకు కనిపించే దేవుళ్లు మాత్రం ఈ లోకంలో నలుగురే. వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి. భారతీయ గృహస్త ధర్మాల్లో ఆతిథ్యానికి ఎంతో ప్రాముఖ్యమున్నది. వారం, తిథి, నక్షత్రం, సమయం, సందర్భంతో ప్రమేయం లేకుండా ఇంటికి వచ్చేవాడు అతిథి. అంటే, ఆహ్వానించకుండానే ఇంటికి వచ్చేవాడు అతిథి. అయితే, ఆహ్వానిస్తే వచ్చేవాడు అభ్యాగతుడు. ఇంటికి వచ్చిన అతిథిని ‘అతిథి దేవోభవ’ అంటూ దైవంగా భావించడం భారతీయ సంప్రదాయం. అతిథి ధీమంతుడు కాకపోయినా, సామాన్యుడే అయినా అతడు పూజార్హుడే. కులమేదైనా, జాతి ఏదైనా అతిథి శ్రీమహావిష్ణువుతో సమానం.
ధన్యవాదాలు!
Similar questions