తెలుగు భాష గొప్పదనాన్ని వివరించే వ్యాసాలను, పద్యాలను సేకరించండి. వాటి గురించి తరగతిలో చర్చించండి.
Answers
, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 7.4 కోట్ల (2011) జనాభాతో [1] ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో 15వ స్థానంలోనూ, భారత దేశంలో హిందీ తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల (2020) మందికి మాతృభాషగా ఉంది.[2] అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వం గుర్తించింది.
తెలుగు
తెలుంగు
స్థానిక భాష
భారతదేశం, బహ్రయిన్, కెనడా, ఫిజీ, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ప్రాంతం
తెలంగాణ , ఆంధ్ర (అధికార భాష), అండమాన్ నికోబార్ దీవులు (అదనపు అధికార భాష), పశ్చిమ బెంగాల్ (అదనపు అధికార భాష), ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్
స్వజాతీయత
తెలుగు వారు
స్థానికంగా మాట్లాడేవారు
7.4కోట్లు పైగా (భారత దేశం)[1] (2011)
భాషా కుటుంబం
దక్షిణ-మధ్య ద్రవిడ భాషలు
తెలుగు
Dialects
సాగరంధ్ర మాండలికం లేదా కోస్తా మాండలికం (కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలోని ప్రాంతాలు)
రాయలసీమ మాండలికం (రాయలసీమ నాలుగు జిల్లాలోని ప్రాంతాలు)
కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికం (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ప్రాంతాలు)
తెలంగాణ మాండలికం (తెలంగాణా రాష్ట్రo లో, ఆంధ్ర తెలంగాణా సరిహద్దు ప్రాంతాలలో ).
రాసే విధానం
తెలుగు లిపి /au/
అధికారిక హోదా
అధికార భాష
భారతదేశం
భాషా సంకేతాలు
ISO 639-1
te
ISO 639-2
tel
ISO 639-3
tel
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభం, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలం. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం
వెనుజులకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతంన కలిగి) గా ఉండటం గమనించి తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించాడు.[3] కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించాడు. కన్నడ అక్షరమాల తెలుగు భాష లిపిని పోలిఉంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా తెలుగు భాషను పోలిఉంటాయి.