India Languages, asked by baddamramchendereddy, 4 months ago

మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటల్లో రాయండి.​

Answers

Answered by Hema266
22

Hey mate !!

Here is ur Answer ⤵️

కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.

పెంపుడు తల్లి: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.

సవతి తల్లి: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.

పెత్తల్లి లేదా పెద్దమ్మ: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.

Hope it helps you ✔️

Thank you ❣️

@Love hunter

Answered by sriteja2780
23

Explanation:

మాటలకు అందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.

మాటలకు అందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదన మరచిపోయేది అమ్మ.

మాటలకు అందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదన మరచిపోయేది అమ్మ.బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు.

అమ్మ...! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో... ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం తీయని రాగం’అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవం ఉందా? అవును మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా.

అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం.

అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం.బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన భారతీయ సమాజం సైతం ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు.. కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్నా అని అనం.. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి... ఓ అనుబంధం... ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత.

Similar questions