అచ్చతెలుగు భాషలో రాయబడిన ఈ పాఠం చదివారు కదా ! దీనిపై మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా రాయండి.
Answers
Answer:
దీనికి సమాధానం ‘మనిషి’. పాకేటప్పుడు నాలుగు, నడక వచ్చి పరిగెత్తేటప్పుడు (పైన పొడుపు కథలో ‘పరిత్తేటప్పుడు’ అనేది పద ఉచ్చారణ రూపం) రెండు, వార్థక్యంలో చేతికర్రతో కలిపి మూడు, మరణించాక సాయం వచ్చే ‘ఆ నలుగురి’ని కలుపుకుంటే ఎనిమిది... లెక్క సరిపోయిందా! పుట్టినప్పటి నుంచి పుడమిలో కలిసిపోయేదాకా ‘నడిచే’ మనిషి జీవితాన్ని పన్నెండు పదాల్లో ఇమిడ్చిన పొడుపు కథ ఇది. ఇలాంటి వాటితో పాటు కాలప్రవాహంలో కొట్టుకుపోయిన ఎన్నో అచ్చ తెలుగు పదాలు, సామెతలు తమిళనాడు తెలుగు వారి నాలుకలపై నిత్యం నర్తిస్తుంటాయి. వందల శతాబ్దాల కిందట సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ గడ్డకు వలసెళ్లిన తెలుగు వారు... ఎక్కడ ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొన్నా మాతృభాషను మాత్రం మరిచిపోలేదు. తరాల తరబడి దానిని కాపాడుకుంటూనే వస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సగిలి సుధారాణి... తమిళనాడులోని ఇరవై జిల్లాల్లో రెండున్నరేళ్ల పాటు క్షేత్ర పర్యటనలు చేశారు. అక్కడి తెలుగు వారిపై విస్తృత పరిశోధన చేశారు. ఆ రాష్ట్రంలో కొనఊపిరితో ఉన్న తెలుగు జానపద కళారూపాల ఆనుపానులను తెలుసుకున్నారు. ‘అచ్చ తెలుగు ఇంకా అక్కడ బతికే ఉంది. నేడు మన నిత్య వ్యవహారంలో వాడేస్తున్న అనేక అన్యభాషల పదాలకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగపడే ఎన్నో తెలుగు మాటలు అక్కడ వాడుకలో ఉన్నాయ’ని చెప్పే సుధారాణితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖీ
Explanation:
TEJASRI HERE