వీర తెలంగాణ పాఠ్య బాగా సార అంశం సొంత మాటల్లో రాయండి
Answers
Answer:
తెలంగాణము పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కసారిగా ప్రతిధ్వనించాయి. ఉదయించిన సూర్యుడి కిరణాలతో, ప్రీతిపొందిన పద్మాలతో చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేలా చేశాయి. తల్లి తెలంగాణ గొప్పదనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజలు గతించి, అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకు తోవను చూపే కాలం వచ్చింది. సంధ్యా సూర్యుడు మొదటిసారి ఉదయించాడు.
తెలంగాణాలో పిల్లలు యుక్తవయస్సు రాగానే నిజాం రాజుతో తలపడ్డారు. ఈ తెలంగాణ నేలలో ఎంతో బలం ఉంది. గొప్ప రాజుగా పేరొందిన నైజాం నవాబు గర్వాన్ని అణిచేలా యుద్ధం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలు ఇంధ్రధనుస్సుల పరంపరలతో ఆకాశంలో సయ్యాటలాడాయి.
గడ్డిపోచ కూడా కత్తిపట్టి ఎదిరించింది. తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. నవాబుల ఆజ్ఞకు కాలం చెల్లించారు. తెలంగాణ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఉంది. భూమండలాన్ని అంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్తకాంతి సముద్రాలు నింపారు. తెలంగాణా వీరులు యోధులే కాదు. న్యాయం తెలిసిన పరోపకారులు.
మతం అనే పిశాచి తెలంగాణ నేలను ఆక్రమించి గొంతులను కోస్తున్నప్పుడు, ప్రజలకు బతకడం భారమైనప్పుడు కూడా వారు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధంలో రుద్రాదులు మెచ్చేలా విజయం సాధించారు.
తెలంగాణలో కాకతీయరాజుల కంచుగంట మోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడి విజృంభణతో శత్రురాజుల గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు జయ జయ ధ్వనులు మోగాయి.
నాటి నుంచి నేటి వరకు తెలంగాణం శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలో మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా తెలంగాణా ముందుకు సాగుతూనే ఉంది.
I HOPE ITS HELP YOU THANK YOU