India Languages, asked by chakeletilokesh2005, 19 days ago

బూరుొ ల వేక్్త్వం లోన్న మహో నిత్ లక్షణ్ాల గణర ంచి రాయండి.​

Answers

Answered by nihasrajgone2005
5

Answer:

లష్కర్ లో ముందుగాల్నే బోనం.. 2రోజుల ముందే శోభ

V6 Velugu Posted on Jul 20, 2019

ఉజ్జయినీ మహంకాళికి ముదిరాజ్‌ ల బోనాలు

రెండు రోజుల ముందే పండుగ శోభ

ఆదివారం వేడుక కోసం ఏర్పాట్లు పూర్తి

బోనాల శోభ లష్కర్‌‌కు రెండు రోజుల ముందే వచ్చింది. ఉజ్జయిని మహంకాళి అమ్మకు ముదిరాజ్‌ లు ఆనవాయితీ ప్రకారం శుక్రవారం అంగరంగ వైభవంగా ముందస్తు బోనాలు సమర్పించారు. వేల సంఖ్యలో మహిళలు తలపై బోనాలతో క్లా క్ టవర్ నుంచి ర్యాలీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వీరితో పాటు మిగతా భక్తులు కూడా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లన్నీ నిండి పోయి కనిపించాయి. ఇదిలా ఉండగా ఆదివారం వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో అమ్మవారి ఆలయం వెలుగులు విరజిమ్ముతోంది.

రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు

లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆది, సోమవారాల్లో(21, 22) ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి సోమవారం రాత్రి 10 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. – హైదరాబాద్,వెలుగు

ట్రాఫిక్ ఆంక్షలు : 21న ఉదయం

4 గంటల నుంచి పూజ పూర్తయ్యే వరకు

ఈ ప్రాంతాల్లో రోడ్ల మూసివేత :

-మహంకాళి టెంపుల్ వైపు వచ్చే టొబాకో బజార్, హిల్ స్ట్రీట్, జనరల్ బజార్‌‌లో రూట్లలో ట్రాఫిక్ నిలిపివేత.

-సుభాష్ రోడ్, బాటా చౌరస్తా, రాంగోపాల్‌‌పేట రోడ్లను మూసివేస్తారు.

-అడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి టెంపుల్ రూట్ రాకపోకలు నిలిపివేత.

-జనరల్ బజార్ నుంచి ఆలయం మార్గం రోడ్డు మూసివేత.

దారి మళ్లింపు..

-రాణిగంజ్ క్రాస్ రోడ్స్ వద్ద : కర్బలా మైదాన్ నుంచి మినిస్టర్ రోడ్‌‌కు వచ్చే ట్రాఫిక్‌‌, ఆర్టీసీ బస్‌‌లను రాణిగంజ్, రసూల్ పుర చౌరస్తా, మినిస్టర్ రోడ్డు వైపు దారి మళ్లింపు.

-ఘాన్సీమండి వద్ద : బైబిల్ హౌజ్ నుంచి సజ్జన్‌‌నాల్ స్ట్రీట్ వైపు వెళ్లే వాహనాలను ఘాన్సీమండీ చౌరస్తా వద్ద దారి మళ్లింపు.

-ప్యాట్నీ క్రాస్ రోడ్స్ వద్ద : ఎస్‌‌బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్‌‌పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌‌ను ప్యాట్నీ క్రాస్ రోడ్స్, క్లాక్ టవర్, ప్యారడైజ్ మీదుగా దారి మళ్లింపు.

-ప్యారడైజ్ నుంచి వచ్చే వాహనాలను ఆర్పీ రోడ్ మీదుగా ప్యాట్నీ క్రాస్ రోడ్స్, ఎస్బీహెచ్, క్లాక్ టవర్ మీదుగా మళ్లింపు.

-క్లాక్ టవర్ నుంచి ట్రాఫిక్ ను ఆర్పీరోడ్ మీదుగా ప్యాట్నీ క్రాస్ రోడ్స్, ఎస్బీహెచ్, ప్యారడైజ్ మీదుగా మళ్లింపు.

ప్యారడైజ్ క్రాస్ రోడ్స్: సీటీవో జంక్షన్ మీదుగా ఎంజీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌‌ను ప్యారడైజ్ చౌరస్తాలో దారి మళ్లింపు.

22న ఆంక్షలు : మధ్యాహ్నం 2 గంటల నుంచి

రాత్రి 10 గంటల వరకు

-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సెయింట్ మేరీ రూట్ లో ట్రాఫిక్‌‌కు అనుమతి లేదు.

-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్‌‌పల్లి, బాలానగర్, అమీర్‌‌పేట వెళ్లే ట్రాఫిక్‌‌ను క్లాక్ టవర్ నుంచి ప్యాట్నీ, సిమ్మింగ్ పూల్ మీదుగా మళ్లిస్తారు.

ఉత్సవాలకు వచ్చే వాహనాల పార్కింగ్ ప్రదేశాలు

-సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్‌‌ ఉప్‌‌కార్, ఎస్‌‌బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజీలో పార్క్ చేయాలి.

-కర్బలా మైదాన్, బైబిల్ హౌస్, ఘాన్సిమండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హై స్కూల్‌‌ గ్రౌండ్స్.

-రాణిగంజ్, అడవయ్య క్రాస్‌‌రోడ్స్ వైపు వాహనాలు ప్రభుత్వ అడవయ్య మెమోరియల్ హై స్కూల్ గ్రౌండ్స్

-సుభాష్ రోడ్డు వైపు వాహనాలు ఓల్డ్ జింఖానా ఓపెన్ ప్లేస్‌‌లో పార్కు చేయాలి.

Similar questions