కళలను ఆనందించలేని వాడు రాయిలాగే జడుడు అంటే
అర్థం ఏమిటి?
Answers
Explanation:
కనులు మూసి కనేది కల , కనులతో భావాలను పలికించేది మనసులను కదిలించేది కళ.
అనాది కాలమునుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు.వీటిలో కొన్ని ఉపయోగదృష్టితోడను కొన్ని సౌందర్యదృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చును.ప్రతిభానైపుణ్యములకు దావలములైన వీటన్నింటిని కళలుఅని అంటారు.
వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించారు.వీటిలో మొదటతెగకు చెందినవి మానవశరీర సౌందర్యమునకును, రెండవతెగకు చెందినవి మానవహృదయానందమునకును తోడ్పడును.మొదట తెగవానిని సామాన్యకళలని, రెండవ తెగవానిని లలితకళలని చెప్పుచున్నారు.
లలితకళలను మాట ఆంగ్లభాషయందలి FINE ARTS అను పదమునకు పర్యాయపదమునకు వాడబడుచున్నది.
కవిత్వము, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం - ఈ ఐదింటిని లలిత కళలు అంటారు.
ఈ కళల్లో కృష్ణరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు చిత్రకారులు, శిల్పులు ఉండేవారు వారు తమ తమ కళలలను అద్భుత రీతిలో ప్రదర్శించి రాయల మన్ననలు అందుకునేవారు.
కళలలు మానవుని హృదయాన్ని స్పందింపచేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయిలాగ జడుడని చెప్పవచ్చు
జడుడు అంటే దేనికి స్పందించని వాడు అని అర్థం
కళలకి రాయి సైతం స్పందించును అయితే దానికి కూడా స్పందన లేని వాడు రాయిలగా కదలలేని వాడు అని అర్థం.