India Languages, asked by guttashalinigmailcom, 3 months ago

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామలో కనిపించే జానపద కళారూపాలు ఏవి?​

Answers

Answered by BarbieBablu
4

సంక్రాంతి పండుగ మూడు రోజులు

1. మొదటి రోజు (భోగి) :

➙ భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది.

➙ ఆ రోజున తెల్లవారు జామున భోగి మంటలు వేస్తారు.

➙ శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చేవేయటమే భోగి.

➙ ఇలా చేయటం వాళ్ళ దురదృష్టలు తొలగిపోతాయని నమ్మకం.

➙ సంక్రాంతిలో నెల రోజుల నుండి చేసిన గొబ్బెమ్మలను పీడకలగా చేసి భోగి మంటలలో వేస్తారు.

➙ సాయంత్రం బొమ్మల కొలువులు పెడతారు.

➙ చిన్న పిల్లలకు రేగుపండ్లు, పూలను తలపై పోస్తారు.

➙ ఇలా చేయటాన్ని భోగిపండ్లు పోయటం అని అంటారు.

ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను బాగా భాగ్యాలతో అప్పటికి అలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారు.

2. రెండవ రోజు (మకర సంక్రాంతి) :

➙ సంక్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం.

➙ సూర్యుడు మకర రాశిలోకి కదలటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు.

అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తరువాత అయ్యప్పను, మకర జ్యోతిని కూడా ఈ రోజే దర్శించుకుంటారు.

➠ ఈ రోజు గాలి పాటలు ఎగుర వేయటం, పందాలు కాయటం చేస్తారు.

➠ ఆడవారు ముగ్గులు వేయటం, ముగ్గుల పోటీలు జరుపుకోవటం చేస్తారు.

➠ ఈ పండుగరోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు.

➠ స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం.

3. మూడవ రోజు (కనుమ) :

➙ ఇది సంక్రాంతి చివరి రోజు, నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి.

➙ ఈ రోజున పశువులను లక్ష్మి స్వరూపాలుగా భావించి, అందంగా అలంకరించి పూజిస్తారు.

ఇలా చేయటం వాళ్ళ ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం.

➙ ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు.

➙ సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు.

ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది.

Attachments:
Similar questions