రాణి శంకరమ్మ పరాక్రమాన్ని సొంత మాటాల్లో రాయండి
Answers
రాణి శంకరమ్మ
పూర్వం అందోల్ రాజ్యాని 24 పరగణాలుగా విభజింఛి పరిపాలించిన రాయబాగిన్ మహా రాణి శంకరమ్మ 1702 వ సంవత్సరo లో సంగారెడ్డి పట్టణానికి సుమారు 12 కి.మీ దూరంలో ఉన్న గౌడిచర్ల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లి పేరు రాజమ్మ, తండ్రి పేరు సంగారెడ్డి. భర్త పేరు వెంకట నరసింహారెడ్డి. తన భర్త శత్రువుల చేతిలో హత్య చేయబడ్డ తర్వాత భర్త ఆశయాలను నిలుపడానికి, అత్తమామల ఆజ్ఞతో అందోల్ రాజ్యాని పరిపాలించింది. శంకరమ్మ తండ్రి పేరున వెలిసిన ప్రస్తుత పట్టణమే సంగారెడ్డి. వారి తల్లి పేరున ఉన్న గ్రామం రాజంపేట. ఆమె పెంపుడు కొడుకైన సదాశివరెడ్డి పేరున ఉన్న నేటి పట్టణం సదాశివపేట.
ఆ తెలంగాణలో మెతుకు సీమ సిగలో విరిసిన శౌర్య పారిజాతం రాణి శంకరమ్మ. ఈమె నేటి మెదక్ జిల్లాలోని అందోలును రాజధానిగా చేసుకొని రాజ్యం చేసింది. శత్రువులకు సింహ స్వప్నమైంది. ప్రజలకు ఆరాధ్యదేవతైంది. నేటికీ ఈమె గురించిన కథలు, పాటలుగా, గాథలుగా చెప్పుకుంటారు పల్లెప్రజలు, శంకరమ్మకు ఒక చిరుతపులి ఎదురుపడితే దాన్ని ధైర్యంతో ఎదుర్కొన్నది. కాళ్ళతో తొక్కింది. దానిని చంపివేసింది. ఆమె నారసింహారెడ్డిని వివాహం చేసుకొంది. శంకరమ్మ నారసింహారెడ్డిని రాజ్యపాలన చక్కగా చేయమని రాజధర్మాన్ని చెప్పింది. తన భర్త మరణించినపుడు నిజాం రాజు మరాఠీల పైకి యుద్ధానికి పంపాడు. విజయం తర్వాత నైజాం నవాబు శంకరమ్మకు 'రాయబాగిన్' అనే బిరుదునిచ్చాడు.1764వ సం॥లో అందోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయ్యింది. చక్కగా రాజ్యపాలన చేసింది. రాజ్యాన్ని తన శూరత్వంతో విస్తరించుకున్నది. ప్రజలను కన్నబిడ్డలుగా పాలించింది. ప్రజలకు పన్నులభారం తగ్గించింది. ఆమె తన తండ్రిపేరిట సంగారెడ్డి, తల్లి పేరిట రాజంపేట పట్టణాలను నిర్మించింది.. గరుడాద్రి గుట్టపై రంగనాధాలయాన్ని కట్టించింది. 1774వ సంవత్సరంలో శంకరమ్మ తుది శ్వాస విడిచింది. అందోలు చరిత్రలో ఆమె కీర్తి సువర్ణాక్షరాలతో లిఖించబడింది.