వన్య ప్రాణులు సంరక్షణ గురించి వ్యసము రాయండి
Answers
వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో వాటి సంరక్షణ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఏటా అన్ని దేశాలూ ఈ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మార్చి 24, 1925న జర్మనీలోని బెర్లిన్‌లో జంతు ప్రేమికుడు హెయిన్‌రిచ్ జిమ్మర్‌మన్ 'వరల్డ్ ఏనిమల్ డే'ను నిర్వహించారు. అప్పుడు ఆ కార్యక్రమానికి దాదాపు 5 వేల మంది హాజరయ్యారు. తర్వాతి కాలంలో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని అక్టోబర్ 4కి మార్చారు. ఆరోజు పర్యావరణ ప్రేమికుడు ఫ్రాన్సిస్ అసిస్ జన్మదినం. తొలుత జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, చెకోస్లొవెకియా దేశాల్లో మాత్రమే దీన్ని జరిపేవాళ్లు. ఇప్పుడు దాదాపు అన్ని దేశాలూ జరుపుతున్నాయి.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణుల వేట నిషేధం. ఈ చట్టం వచ్చాక దేశవ్యాప్తంగా 23 టైగర్ ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో 441 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలున్నాయి. అందులో 28 టైగర్ జోన్లు ఉన్నాయి. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా లక్ష పైగా పులులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 3500కి పడిపోయింది. వీటిలో 1400 పులులు మనదేశంలో ఉన్నాయి. అన్ని రకాల వన్య ప్రాణులను రక్షించుకోవటమే ఈరోజు ఇచ్చే సందేశం.