అరుట్ల కమలాదేవి బాల్య వివాహం
గురించి రాయండి
Answers
...................అరుట్ల కమలాదేవి...................
ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది. వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలొ కూడా భర్తతో పాటు పాల్గొంది. ఆంధ్రమహాసభలకు కూడా హాజరై ఉత్తేజాన్ని పొందింది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి జైలుకు వెళ్ళిది. 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది. 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికైనది. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా, పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది.
ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది. వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలొ కూడా భర్తతో పాటు పాల్గొంది. ఆంధ్రమహాసభలకు కూడా హాజరై ఉత్తేజాన్ని పొందింది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి జైలుకు వెళ్ళిది. 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది. 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికైనది. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా, పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది.విరోచిత తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం జాతీయోద్యమ చరిత్రలో నూతనాధ్యాయాన్ని తెరచింది. ఈ పోరాటానికి నాయకత్వ పాత్ర వహించింది కమ్యూనిస్టుపార్టీ. అందులో మహిళల పాత్ర అపూర్వం, అనిర్వచనీయం. దానికి ప్రత్యక్ష నిదర్శనం వీరవనిత ఆరుట్ల కమలాదేవి. తన తరం మహిళలు గృహిణులుగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో పెళ్ళికి ముందు "రుక్మిణి" గా వుండి ఆ తరువాత కమలాదేవిగా మారి కమ్యూనిస్టు ఉద్యమ వీరనారీమణులలో ఒకరిగా 2001 జనవరి 1 న కన్నుమూశారు. ఎ.ఆర్ గా అంతా పిలుచుకునే సాయుధపోరాట సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్యగా, రాజకీయరంగంలో కూడా భర్తతోపాటు కొంగుబిగించి తుపాకీ చేబూని గెరిల్లాపోరాటం సాగించిన పోరాట వీరగాథలు నేటికీ యువతరానికి ఒక ఉత్తేజం.
☞︎︎︎ ʜᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘs ʏᴏᴜ ☺️
..