ఆత్మ విశ్వాసం గురించి ఒక వ్యాసం రాయండి.
Answers
ఆత్మ విశ్వాసం అంటే"మన మీద మనకు గట్టి నమ్మకం". జీవితం అంటేనే కష్టసుఖాల సమ్మేళనం.జీవితంలో ఎంతో పోరాడాల్సి వస్తుంది.ఎవ్వరి జీవితం వడ్డించిన విస్తరాకు కాదు.మనం జీవితంలో ఎదగాలంటే ఎంతో ఓర్పు వహించాల్సి ఉంటుంది.ఎందరో మహనీయుల జీవితాలు మనకు ఆదర్శంగా నిలిచాయి.కారణం వారు అనుకున్న లక్ష్యాన్నీ సాధించడంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న చివరకు ఆ లక్ష్యాన్ని సాధించి అందరికీ ఆదర్శప్రాయమైనారు.దానికి వారి ఆత్మవిశ్వాసమే కారణం.తమను తాము నమ్ముకొన్నారు. వారి నడచిన బాటే మనకు ఆదర్శం.
జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు సంభవిస్తూ ఉంటాయి.అంతమాత్రం చేత నిరాశ నిస్పృహలకు లోనుకాకుడదు.ఒక చిన్నపిల్లవాడు మెట్లు ఎక్కుతూ పోతూ ఉంటే వాడు ఎన్నో మార్లు పడుతూ ఉంటాడు. మరల వాడు ఆ మెట్టు ఎక్కడానికి కృషి చేసి పై మెట్టు వరకు వెళతాడు.వాడిలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే పైకి వరకు వెళ్ళగలుగుతాడు. పడడం ప్రమాదం కాదు కోలుకుని లేచి లక్ష్యం సాధించకపోవడం ప్రమాదం.ఆ లక్ష్యాన్ని సాధించడం వివేకవంతుల లక్షణం.
"సావిత్రిభాయ్ ఫూలే"1848 " లో మహిళలకు,అట్టడుగు వర్గాలకు వారికి చదువు రావాలని ఉద్దేశ్యంతో బాలికల పాఠశాలను ప్రారంభించి ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచారు.మహిళలకు సమాన హక్కులు రావాలంటూ పోరాడారు.అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా ఆమె వెనుతిరగలేదు. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకూ శ్రమించారు. ఎక్కడ ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు .అదే ఆమెకు గమ్యాన్ని చేరుకొనేలా చేసింది.ఇప్పటికి ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకొంటారు. ఆమె ఆత్మవిశ్వాసమే ఆమెకు ఆభరణం.
ముందుగా ఏదైనా ఆపద వస్తే సహనాన్ని కోల్పోరాదు.అధైర్యపడకుండా,ఆత్మవిశ్వాసం తగ్గకుండా,ఆలోచించి ముందుకు నడవాలి. కష్టాలు మనుషులకు రాకపోతే మానులకు వస్తాయా, అన్నింటిన్నీ అధిగమిస్తేనే మనం అవతలి వారికి ఆదర్శప్రాయులవుతాం.అంతెందుకు మనం ఒక డాక్టరు వద్దకు వెళ్ళి రోగానికి మందు తెచ్చుకుంటాం. మనకు ఆమందు గురించి సరైన అవగాహనలేకపోయినా ఆమందుని డాక్టరు రాసి ఇచ్చాడని నమ్మకంతో వేసుకుంటాం. తెలియనిది నమ్ముతుంటే మన గురించి మనకు తెలిసి నప్పుడు మన మీద మనకు ముందు నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం మనిషిని నడిపిస్తుంది.ధైర్యాన్ని ఇస్తుంది. ఒక మంచి పనిని ప్రారంభించినప్పుడు మనం ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనుకకు లాగే వారే ఎక్కువ మంది ఉంటారు.మధ్య మధ్యలో ఆటుపోట్లు, అవహేళలను ఎదురైనా మనం అనుకున్న ఆ పనిని పూర్తి చేయడంలోనే ఉంది నిజమైన ఆనందం.
Answer:
ప్రతి మనిషికీ తమపై తమకు నమ్మకం ఉండటం చాలా అవసరం. దీనినే ఆత్మ విశ్వాసం అని అంటారు. దీనికి ఆంగ్లంలో Self Confidence అని అర్థం. "నేను చేయగలను" అని అనుకునేదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చెయ్యగలరు. ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపొతే ఏ రంగంలోనైనా సరిగ్గా రాణించలేరు. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్యౌషధంలా పని చేస్తుంది. అనుకున్న పనిని అనుకున్నట్టు సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా తోడ్పడుతుంది.
ఎంత బాగా ఆత్మవిశ్వాసం ఉంటే అంత బాగా మనం జీవితంలో పైకి రావచ్చు.ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి. ఈ అవగాహనే మన మాటల్లో ధ్వనిస్తుంది. దీనివల్ల మనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో అవతలి వారికి తెలుస్తుంది. ఏ విధమైన తప్పుడు ఆలోచనలకి మన మనసులో చోటు ఉండకూడదు. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది.
మన ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరిచే కొన్ని అంశాలు ఉన్నాయి. అవి