నివఇటివల జరుపుకున్న ఉగాది పండుగను
గూర్చి వివరిస్తూ నీతుమిత్రునికి లేఖ వాయుము?
Answers
Answered by
0
ఉగాది పండుగను గూర్చి వివరిస్తూ మిత్రునికి లేఖ:
ప్రియమైన వేణి,
మేము ఇక్కడ బావున్నాము. మీరు అంత బావున్నారని తలుస్తాను. ఎలా చదువుతున్నావు? నాకు వచ్చే నెల పరీక్షలు బాగా చదువుతున్నాను. క్రిందటి వారం ఉగాది మేము చాలా బాగా జరుపుకున్నాము. ఉదయమే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాము. ఆ రోజు ఉదయము మరియు సాయంత్రం గుడికి వెళ్ళాము. అమ్మ ఉగాది పచ్చడి చేసింది. అందరం పచ్చడి తిన్నాము. ఎంతో రుచికరంగా ఉంది. ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉన్నాయి. అవి తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు, మరియు చేదు. వీటినే షడ్రుచులు అంటారని అమ్మ చెప్పింది. నీవు కూడా ఉగాది ఎలా జరుపుకున్నారో తప్పకుండ లేఖ రాస్తావని తలుస్తాను.
ఇట్లు నీ స్నేహితురాలు,
పద్మిని.
Similar questions