సజ్జనుల లక్షణం ఎఱుక తో ఉండడం - గీతగీసిన పదానికి అర్థం ఏది?
Answers
Answer:
తెలుగులో వైజ్ఞానిక విషయాల రాసే వారికి వైజ్ఞానిక విషయాల మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు వేరుగా వుంటాయి. తెలుగులో పారిభాషిక పదజాలం లేదని ఇంగ్లీశు పదబంధాల మధ్య తెలుగు క్రియావాచకాలని జొప్పించతే వచ్చే భాష తెలుగూ కాదు, ఇంగ్లీషూ కాదు. అటువంటి భాష వాడితే వ్యాసాల ప్రయోజనం, భాషా ప్రయోజనం నెరవేరదు.
వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఉన్న ఇంగ్లీశు వ్యాసాలను తెలుగులోకి అనువదించడంలో ప్రధాన సమస్య పారిభాషిక పదజాలం. వేమూరి గారి పరిశోధన [1] ప్రకారం, తెలుగులోకి అనువదించబడ్డ పాఠ్యాంశంలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీశు తత్సమాలు 25 శాతం మించకుండా ఉండాలి. ఇలా జరగాలంటే మొదట, ఇంగ్లీశు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీశు తత్సమాలని వాడటం కంటే తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీశు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీశు మాటలని తెలుగు లిపిలో రాయటం. (ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీశు లిపిలో చూపించటం.)