మీ గ్రామంలో లేదా వాడాలో వలస కూలీలు వద్దకు వాళ్లు బంధువులు వద్దకు వెళ్ళి వలస ఎందుకు వెళ్లారో వారిని ఇంటర్వ్యూ చేసి నివేదిక రాయడి
Answers
Answer:
దేశంలో వలస కార్మికులు ఆకలి కేకలు, మరణాల వార్తలు పదే పదే వస్తున్నాయని.. వారికి సాయం చేయటానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
వలస కార్మికుల కష్టాలపై మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గురువారం నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఆహారం, నిధులు, వసతి, రవాణా సదుపాయాలకు సంబంధించిన మొత్తం ఏర్పాట్ల గురించి శరపరంపరలా ప్రశ్నలు ఎదుర్కొన్నారు.
జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దాదాపు 50 ప్రశ్నలు అడిగింది. ''తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికి రిజిస్ట్రేషన్, రవాణా, ఆహారం, తాగునీరు అందించటంలో పలు లోపాలను మేం గుర్తించాం'' అని ధర్మాసనం పేర్కొంది.