India Languages, asked by chinchu6044, 1 year ago

దాశరథి గారి తో ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? మీ అభిప్రాయం చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
15
తెలంగాణా ముద్దు బిడ్డ ఐన దాశరధి రంగాచార్య గార్కి తెలంగాణా సాయుధ పోరాటంతో గల సంబంధం, గురించి తెలుసుకొని ఏంటో సంతోషించాము.వారు రచిచిన చిల్లరదేవుళ్ళు,జానపదం,మోదుగ పూలు వంటి నవలలు,కొన్నిటిని అందరు తప్పక చదవాలి.నాలుగు వేదాలను,ఉపనిషత్తులను,తెలుగులోకి అనువదించిన ఆ మహాను భావుని గొప్పదనం గురించి తెలిసింది.అటువంటి పండితుని పై కమ్యునిస్టుల ప్రాభావం వుందని తెలిసి ఆశర్యం వేసింది.ఆయన ఉద్యమ జివి అని,తెలంగాణా ముద్దుబిడ్డ, అని అనిపించింది.






 పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది. ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది రెండో రకం .
Answered by suggulachandravarshi
2

Answer:

హలో!

ఈ ప్రశ్న, రంగాచార్యులు తో ముఖముఖి అనే పాఠం నుంచి ఇచ్చారు.

నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు.

తెలంగాణ ముద్దుబిడ్డ అయి ఎంతో గొప్ప వ్యక్తి అయినా దాశరధి రంగాచార్యులు గారితో ముఖాముఖి జరపడం నిజంగా ఎంతో ఆనందదాయకం. నిజంగా అటువంటి వాడితో మాట్లాడటం అనేది సంతోషకరం, ఆనందకరం.

ఆయన మాతో జరిపిన ఇంటర్వ్యూలో ఆయన గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.

ఆయన ఎంతో గొప్ప వారని తెలిసింది. నాలుగు వేదాలను, రణరంగం, ఉర్దూ మధిర, వంటివి తెలుగులోకి అనువదించారు.

ఈయన గారు రాసిన "చిల్లర దేవుళ్ళు" నవల కి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు.

ఇంత గొప్ప వారు అయ్యుండి కూడా వారిపై కమ్యూనిస్టుల ప్రభావం ఉండడం బాధాకరం అనిపించింది.

Similar questions