ఉత్తమ పాలనను రామరాజ్యం తో పోలుస్తారు కదా! శ్రీ రాముని పరిపాలన ఏ విధంగా ఉండేదో తెలుసుకొని నివేదిక రాయండి
Answers
Answer:
‘నేడు మనం సమాజంలో పాలనా పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. గృహస్థాయి, పంచాయతీస్థాయి నుంచి దేశస్థాయి వరకు ఈ సమస్యలు వికృత రూపాన్ని ధరించి మానవ జాతి అభ్యున్నతికే గొడ్డలిపెట్టుగా తయారవుతున్నాయి. సమాజంలోని అన్ని ప్రధాన వ్యవస్థలు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్య, ఉద్యోగం, మానవ సంబంధాలు ఇలా అన్నీ లోపభూయిష్టంగానే కొనసాగుతున్నాయి. కారణం బాధ్యతా రాహిత్యం. ఎవరికి వారు తమ ధర్మాలను నెరవేర్చకపోవడం. ఎవరి ధర్మాలను వారు సక్రమంగా ఆచరిస్తే నిజానికి ఏ సమస్యలూ తలెత్తవు. పాలకులు తమ పదవిని.. హోదాను అనుభవించేదిగా, భోగాలను సమకూర్చేదిగా భావిస్తున్నారు. విధి నిర్వహణలో తగిన శ్రద్ధను చూపకపోవడం, ఆశ్రితులు-బంధువర్గం ఆనందమే పరమావధిగా భావించి సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని ఆలోచించక తాత్కాలికంగా పరిష్కారాన్ని కనుగొని సంతృప్తి చెందుతున్నారు. తమ వద్ద పని చేసే ఉద్యోగులకిచ్చే వేతనం కంటే ఎక్కువగా వారి నుంచి శ్రమను పిండుకుంటున్నాయి కంపెనీలు, పరిశ్రమలు. శ్రద్ధ- ప్రతిభ-పట్టుదల గల వారికి ప్రోత్సాహం తగ్గిపోతోంది. అనర్హులైన వారిని అందలం ఎక్కిస్తున్నారు. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రజలందరికీ అవసరమైన విద్య, వైద్యం, సాంకేతికత వంటి వాటి అభివృద్ధి విషయంలోనూ తగు శ్రద్ధ చూపకపోవడం వంటివి మన దేశాభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నాయి. నేటి పాలకుల తీరు ఇలా ఉంటే.. రాముని పాలనలో ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం.
ఉత్తమ పాలనను రామరాజ్యం తో పోలుస్తారు
శ్రీ రామ రాజ్యం గురించి మరియు శ్రీ రాముని పాలనా గురించి వాల్మికి రామాయణంలోని యుద్ధకాండలో ప్రత్యేకంగా వర్ణించటం జరిగింది. అయోధ్య నగరం రాజధానిగా సాగిన పాలనలో ప్రజలు ఎలా జీవించేవారో వాల్మికి చక్కగా వర్ణించాడు. శ్రీరాముడి పట్టాభిషేకం తరువాత రామరాజ్యం ఎలా ఉండేదో ఈ క్రింది విధంగా వివరించాడు.
రాముడి పాలన అత్యుత్తమంగా సాగిందని నేటికీ ఆయన పాలన దక్షతను గురించి కథలు కథలుగా ప్రపంచం కీర్తిస్తుంది.
శ్రీ రాముడి రాజ్యంలో ప్రజలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. మంచి పనులు చేసేవారు. దొంగతనాలు, దోపిడీలు ఉండేవి కావు. యువత చురుకుగా ఉండేది. బాధలు ఉండేవి క్రూర జంతువుల నుంచి ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. ప్రజలు ఇతర ప్రాణులకూ హానికలిగించేవారు కాదు. రాముడి కరుణ కటాక్ష వీక్షణతో అన్ని ప్రాణులు హింసను విడనాడేవి.
శ్రీ రాముని పాలనలో ప్రజలు సంపూర్ణ ఆయుష్షుతో జీవించేవారు. అనారోగ్యాలు, బాధలు ఉండేవి కాదు. బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైష్ణవులు, శుద్రులు తమ తమ కర్తవ్యాలను నిష్టగా పూర్తిచేసేవారు.ఎలాంటి కుల మాత బేధాలు ఉండేవి కాదు. రాజ్యంలో అబద్ధాలు మాట్లాడేవారు కాదు. సత్యమే మాట్లాడేవారు.
శ్రీ రాముడి రాజ్యంలో విరివిగా వర్షాలు పడేవి.అన్నిప్రాంతాలు చెట్లతో రంగురంగుల పువ్వులతో కలకలలాడేవి. .
ఉత్తమ పరిపాలన అనగా ప్రజలకు ఎలాంటి కష్ట లేకుండా చూసుకుంటూ కుల మత బేధాలు చూపకుండా వారి కష్టానికి తగ్గ ఫలితం లభించి వారు సంతోషంగా ఉండేలా చూడటం. ఎంతో సుభిక్షంగా ఉండే రామ రాజ్యం లో ప్రజలు ఎంతో సుఖంగా సంతోషంగా ఉండేవారు దేనికి లోటు ఉండేది కాదు, అందుకే ఆయనను దేవుడు అంటారు. ఈ కారణాల వల్లనే ఉత్తమ పాలనను రామరాజ్యం తో పోలుస్తారు.
#SPJ2