సారఫలకలు ఏవిధంగా తయారుచేసుకుంటాయి? ము
Answers
Answer:
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
దీపావళి అంటే ఎంత సరదానో! మరి సరదా వెనుక నిజాల వెలుగులు తెలుసా? బాణసంచా కథలు, రికార్డులు విన్నారా?
అసలు బాణసంచా ఎక్కడ పుట్టిందో తెలుసా? చైనాలో. దీని వెనకాల రెండు కథలున్నాయి. చాలాకాలం క్రితం చైనాలోని హునాన్ ప్రాంతంలో లీ టియస్ అనే సాధువు కొన్ని రసాయనాల్ని కలిపి విచిత్రమైన మంటలు తెప్పించాడట. అవే టపాసులన్నమాట. ఆ సాధువుకు అక్కడ ఒక గుడి కూడా కట్టారు. ఏటా ఏప్రిల్ 18 ఆయనకు పూజలు చేసి బోలెడు టపాసులు కాలుస్తారు.
మరో కథ ప్రకారం 2000 ఏళ్లక్రితం చైనాలో ఓ వంటవాడు మూడు రకాల పొడులను వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. అతడు వాడిన గంధకం, బొగ్గుపొడి, ఒక రకమైన లవణాలను ప్రాచీన చైనీయులు వెదురుబొంగుల్లో కూరి మంటల్లో పడేస్తే 'ఢాంఢాం' అని పేలేది. ఇప్పటికీ టపాసుల తయారీలో ఆ మిశ్రమాన్నే వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాణాసంచా ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం కూడా అదే.