"ఈచ్ వన్ టీచ్ వన్ ' ఉద్యమం దేనికి సంబందించింది ? *
అక్షరాస్యత కోసం
నిరక్షరాస్యత కొరకు
టీచింగ్ కొరకు
స్వాతంత్రమ్ కొరకు
Answers
Answer:
తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలని అన్నారు. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టిలలో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని పేర్కొంటూ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యతా సాధించిన జిల్లాగా మార్చేందుకు కలెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలని పేర్కొన్నారు.
Explanation:
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ర్టంగా మార్చాలని ప్రతి విద్యావంతుడు ఒక నిరక్షరాస్యునికి చదువు నేర్చించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గతంలోను ఈ అంశాన్ని ప్రస్తావించారు. వారి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, పెన్షనర్లు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు పలికి ముందుకు రావడం హర్షణీయం. ఇది ప్రజా ఉద్యమం కాబట్టి అందరూ భాగస్వాములై “అక్షర తెలంగాణ” సాధనకు కృషి చేయవలసిన అవసరం కలదు. ఆర్థిక, మౌలిక వసతుల రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అక్షరాస్యతలో కూడా అగ్రభాగాన నిలుపుటకు కృతనిశ్చయంతో ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన తెలంగాణ అక్షరాస్యతలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే క్రింద నుండి 4వ స్థానంలో అట్టడుగున ఉండిపోయింది. అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ అక్షరాస్యతలో వెనుకబడి ఉండటం వలన జాతీయ స్థాయిలో మానవాభివృద్ధి సూచిలో వెనుకబడి ఉన్నాము. అక్షరాస్యతా శాతం పెరిగితే అభివృద్ధి సూచీలో మన స్థానం మెరుగవుతుంది.