మీకు నచ్చిన రాజకీయ నాయకుని లేదా సంఘసంస్కర్తను అభినందిస్తూ ఒక అభినందన వ్యాసం రాయండి.
Answers
Answer:
Explanation:జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు , చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు
.బ్రిటిష్ కాబినెట్ మిషన్ అధికార బదిలీ ప్రస్తావన చేసేందుకు వచ్చినపుడు, నెహ్రూ , ఆయన సహచరులు విడుదల చేయబడ్డారు.
బ్రద్దలైన మతకలహాలు , గతి తప్పిన రాజకీయాలు, ప్రత్యేక ముస్లిం రాజ్య మైన పాకిస్తాన్ ఏర్పాటు కొరకు ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో నడుపబడుచున్న ముస్లింలీగ్ నుండి వ్యతిరేకతల నడుమ, నెహ్రూ అధిపతిగా నున్న తాత్కాలిక ప్రభుత్వం బలహీనపడింది. మిశ్రమ ప్రభుత్వం కొరకు చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత, నెహ్రూ 1947 జూన్ 3 న ఆంగ్లేయులచే ప్రతిపాదించబడిన భారతదేశ విభజనకు అయిష్టంగానే అంగీకరించారు. ఆయన 15ఆగస్టున భారత దేశ ప్రధాన మంత్రిగా పదవీ స్వీకారం చేసి ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ :గా ప్రసిద్దమైన తన మొదటి ప్రసంగాన్ని చేసారు.
చాలా సంవత్సరాల క్రితం మనము విధితో తల పడ్డాము, ఇప్పుడు మనం అమిత ధృడంగా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది. అర్ధరాత్రి సమయంలో, ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్ర జీవనానికై మేల్కొంది.మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమైనపుడు, చాలా కాలం అణగ ద్రొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది.భారత దేశం కొరకు , దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది." [196]
ఏమైనప్పటికీ, ఈ కాలం తీవ్రమైన మతహింసకు ఆనవాలుగా ఉంది. ఈ హింస పంజాబ్ ప్రాంతం, ఢిల్లీ, బెంగాల్ , భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. శాంతిని పెంపొందించేందుకు, కోపోద్రిక్తులై, దిక్కుతోచక యున్న శరణార్ధులను శాంతింప చేసేందుకు, నెహ్రూ పాకిస్తానీ నాయకులతో కలిసి పర్యటనలు నిర్వహించారు. నెహ్రూ, మౌలానా ఆజాద్ , ఇతర ముస్లింనాయకులతో కలిసి, ముస్లింలకు భద్రత కల్పించి, భారతదేశంలో ఉండేందుకు ప్రోత్సహించేలా చేసారు. ఈ కాలంలోని హింస నెహ్రూను తీవ్రంగా కలచి వేసి, కాల్పుల విరమణను పాటించేలా , భారత-పాకిస్తాన్ యుద్ధం 1947, ఆపడానికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించేలా చేసింది. మతవిద్వేషాలకు భయమునొంది హైదరాబాద్ రాష్ట్ర విలీనానికి మద్దతు ఇవ్వడానికి నెహ్రూ సంశయించారు.