India Languages, asked by morampudirp, 12 hours ago

గోలకొండ పత్రిక గోలకొండ కవుల సంచిక గురించి రాయండి.​

Answers

Answered by BrainlySrijanunknown
4

Answer:

పౌరస్వేచ్ఛ అసలే లేని నియంతృత్వ నిజాం పాలనలో నిత్యమూ నిజాల్ని తెలిపేందుకు సురవరం ప్రతాపరెడ్డి 1926 మే 10వ తేదీన ఉర్దూ కేలండర్ ప్రకారం తీర్ నెల మూడవ తేదీన గోలకొండ పత్రిక[1]ను హైదరాబాదు నుండి 7000రూపాయల పెట్టుబడితో ప్రారంభించాడు. సంపాదకుడిగా ఇతని పేరు లేనప్పటికి సంపాదకత్వం, నిర్వహణ, ప్రచురణ బాధ్యతలు అన్నీ ఇతనివే.తెలుగు చదివిన సబ్‌ ఎడిటర్లు, ప్రూఫ్‌ చూసేవారు దొరకకపోవడం వల్ల ప్రతాపరెడ్డి, సంపాదకుల నుండి మేనేజర్‌గా, సబ్‌ ఎడిటర్‌, ఫ్రూఫ్‌ రీడర్‌గా, గుమాస్తాగా, ఛప్రాసీగా అన్నింటిని తన భుజస్కంధాలపై వేసుకొని, సవ్యసాచివలె బాధ్యతలను కొంతకాలం నిర్వహించాడు. 1939 ఆగస్టు నుంచి అధికారికంగా గోలకొండ పత్రికకు ఇరవై ఏళ్లు ఇతడే సంపాదకుడు. తెలుగు భాషోద్ధరణ, తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యాలతో ఈ పత్రిక స్థాపింపబడింది. మొదట ఈ పత్రిక అర్ధవార పత్రికగా వెలువడింది. ప్రతి బుధవారం, శనివారం వెలువడేది. 31-07-1933 నుండి ఈ పత్రిక ప్రతి సోమవారము, గురువారము ప్రకటించబడేది. దీనికి కారణము మునుపటి సంచికలో ఇలా వివరించారు. "ఇది మొదలుకొని మా పత్రిక సోమ, గురువారములయందు ప్రకటింపబడును. నిజాం రాజ్యముతో ముఖ్య సంబంధము గలదగుటచే మా పత్రికాకార్యాలయమునకు ఆదివారమును మాని శుక్రవారము శెలవుగా నేర్పరచుకొనుటచే మార్పు చేయవలసి వచ్చినది."

Answered by manasijena8679
20

గోలకొండ పత్రిక గోలకొండ కవుల సంచిక గురించి రాయండి.

Similar questions