చిన్నప్పుడే' కథ ద్వారా నాటి గ్రామాలు ఎలా ఉండేవో వివరించండి.
Answers
Answer:
Explanation:
సినిమాల పేజీల్లో రెండు సమాచారపెట్టెలు కనబడుతున్నాయి - {{infobox film}}, {{సినిమా}}. మొదటి దాన్ని ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ వర్గం:ఫలానా సంవత్సరం సినిమాలు ఆనే వర్గంలోకి చేరుతోంది. రెండో దాన్ని ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ వర్గం:ఫలానా సంవత్సరం తెలుగు సినిమాలు అనే వర్గంలోకి చేరుతోంది. ఈ రెండు వర్గాలు వర్గవృక్షంలో ఒకదాని కింద ఒకటి ఉండే రకం. హారిజాంటల్‌గా ఉండేవి కావు. అందుచేత, ఏ పేజీ కూడా ఈ రెండు వర్గాల్లోకీ చేరకూడదు. రెండో వర్గానికి మిదటిది మాతృవర్గం అవుతుంది. ఇప్పుడు ఈ రెండు మూసలు ఉండటం చేత, కొన్ని పేజీలు మొదటి వర్గంలోకి, మరికొన్ని రెండో వర్గంలోకీ చేరుతున్నాయి. సులువైన పరిష్కారంగా {{infobox film}} ను సవరించి, ఆ మూసలో ఉన్న వర్గాన్ని మారిస్తే సరిపోతుంది అని నేను భావిస్తున్నాను. రవిచంద్ర గారూ, నేనేమైనా మిస్సయ్యానేమో తెలియదు. మీరు సినిమాలపై పనిచేస్తున్నారు కాబట్టి, సమస్య ఎక్కడుందో మీరు సరిగ్గా కనుక్కోగలరు. ఈ సంగతిని పరిశీలించి తగు విధంగా పరిష్కరించగలరా? __చదువరి (చర్చ • రచనలు) 03:12, 1 మార్చి 2019 (UTC)
చదువరి గారూ, పాత సినిమా వ్యాసాలు {{సినిమా}} మూసను వాడుతున్నాయి. ఇది పాతబడిపోయింది. అందుకని నేను ఆంగ్లవికీ నుంచి తెచ్చుకున్న {{infobox film}} మూసనే వాడుతున్నాను. ఇది వర్గం:ఫలానా సంవత్సరం తెలుగు సినిమాలు వర్గానికి ట్రాన్స్‌క్లూడు చేసేలా చేస్తే సరిపోతుందనుకుంటున్నాను. లేదా {{సినిమా}} మూస వ్యాసాలన్నింటినీ {{infobox film}} తో రీప్లేస్ చేయాలి. అందులో కొన్ని ఫీల్డులు మార్చవలసి ఉంటుంది. కాబట్టి మొదటి మార్గం సరైందని భావిస్తున్నాను. దీన్ని పరిశీలిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:52, 1 మార్చి 2019 (UTC)
స్వచ్ఛంద రాజీనామా
నేను నా నిర్వాహకహోదా నుంచి స్వచ్ఛందంగా వైదొల్గుటకై నిర్ణయించి నిర్వాహకుల నోటీసుబోర్డులో పేర్కొన్నాను. ఇదివరకే నిర్ణయించిన ప్రకారం నేను రాజీనామా సమర్పిస్తున్నాను. రాజీనామాను ఆమోదించిన తర్వాత సభ్యుడిగా ఉంటూ, అవసరమైతే "తెవికీ విమర్శకుడి"గా మారి తెవికీని సంస్కరించడానికి, తెవికీలో లోటుపాట్లను లేవనెత్తి తెవికీ ప్రగతికి తోడ్పడగలను. అలాగే ప్రధాన చర్చలలో సీనియర్ సభ్యుడిగా పాల్గొనగలను. నిర్వాహకహోదాలో ఉంటూ ఒకవైపు నిర్వహణ చేయజాలని స్థితిలో మరోవైపు తెవికీలో జరుగుతున్న (ముఖ్యంగా నిర్వహణ లోపాలను) లేవెనెత్తే స్థితిలో లేని కారణంగా నిర్వాహక హోదా నుంచి బయటపడాలని నిర్ణయించాను. ఇన్నాళ్ళు నన్ను ఆదరించిన వారికి కృతజ్ఞతలతో ... సి. చంద్ర కాంత రావు- చర్చ 17:29, 1 మార్చి 2019 (UTC)
పాక్షిక నిరోధం తెలుగు వికీపీడియాలో సచేతనం చేసేందుకు ప్రతిపాదన
సహ సభ్యులకు నమస్తే. సముదాయాల్లో చర్చలు, వాతావరణం ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా Community Health Initiatives పేరిట పని సాగుతోంది. అలా చేపడుతున్న చర్యల్లో భాగంగా పాక్షిక నిరోధం విధించగల ఉపకరణం ఒకటి అందుబాటులోకి వస్తోంది.
ప్రస్తుత పరిస్థితి
ఇప్పటివరకూ మనం హెచ్చరించినా వినకుండా సరికాని దిద్దుబాట్లు చేస్తున్నా, ఎన్నిమార్లు చెప్పినా వినిపించుకోకుండా వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నా, తిట్లు తిడుతున్నా - సముదాయం, నిర్వాహకులు అమలు చేయగల చర్య నిరోధం. అవతలివారు ఒకవేళ కొన్ని రకాల పేజీల్లోనే తప్పుగా ఎడిట్ చేస్తూ మిగతా దిద్దుబాట్లన్నీ మంచివే చేస్తూ ఉన్నా - నిరోధిస్తే మొత్తం సైట్ వ్యాప్తంగా నిరోధించగలం. కొన్నిసార్లు సముదాయం చర్చ పేజీల్లో రాయవద్దని, ఫలానా వారి చర్చ పేజీలో రాయవద్దని ఒక వాడుకరిని నిషేధించినా, ఆ ప్రకారం నిరోధించలేదు. కాబట్టి అదొక హెచ్చరికగా మిగిలిపోతుంది, వారు దాన్ని ఉల్లంఘిస్తే చేయగలిగిందల్లా మళ్ళీ మొత్తం సైట్ వ్యాప్తంగా నిరోధించడమే.
ఉపకరణం తెచ్చే మార్పు
ఈ కొత్త ఉపకరణం మన తెవికీలోకి తీసుకువస్తే అవసరాన్ని బట్టి నిర్వాహకులు సైట్-వ్యాప్తంగానే కాక కొన్ని పేరబరుల్లో కానీ, కొన్ని వర్గాల మీద కానీ రాయనీయకుండా నిరోధించవచ్చు. ఉదాహరణకు ఒకరు ఉద్దేశపూర్వకంగా, పదేపదే చెప్పినా వినకుండా తోటి వికీపీడియన్లను అగౌరవకరంగా, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని అనుకోండి వారిని కేవలం వాడుకరి చర్చ పేజీల్లోనూ, చర్చ పేజీల్లోనూ, వికీపీడియా చర్చ పేజీల్లోనూ రాయకుండా ఒకరిని నిరోధించవచ్చు. అలానే మరొకరు అన్నివిధాలా బాగానే రాస్తూ కేవలం కొందరు రాజకీయ నాయకుల పేజీల్లోనే తటస్థతకు దెబ్బతగిలేలా రాస్తూ పోతూంటే వారిని హెచ్చరించి వినకపోతే ఆయా రాజకీయ నాయకుల పేజీలుండే వర్గంలో ఏ పేజీలో మార్పులు చేయకుండా నిరోధించవచ్చు.
మనం వికీపీడియాలో విధించే నిరోధాలు శిక్షలు కావనీ, కేవలం అవతలివారు వికీపీడియాను దెబ్బతీయకుండేందుకే నిరోధాలు విధిస్తున్నాం అంటున్నాం కనుక ఇలా పాక్షిక నిరోధాలు ఉంటే దానికి మార్గం సుగమం చేస్తాయని నమ్ముతున్నాను. దీనిపై మనం చర్చించి, అన్ని విధాలా బావుందనుకుంటే తెచ్చుకుందాం. మరింత సమాచారం కోసం మెటాలో ఈ పేజీ చూడండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:10, 9 మార్చి 2019 (UTC