సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు . ఈ వాక్యంలో సూర్యుడు అనే పదం ఏ భాషాభాగం .
Answers
సూర్యుడు అనే పదము నామవాచకము
భాషాభాగాలు:
తెలుగు బాషాభాగాలను నాలుగు రకాలుగా విభజించారు.
అవి 1. నామవాచకం 2. సర్వనామం 3.క్రియ మరియు 4. విశేషణం
పై అంశాలను క్రింది విధంగా నిర్వచించవచ్చు.
నామవాచకం:
ఒక వాక్యంలో పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు. ఆ పేర్లు ప్రదేశములు, మనుష్యులు, జంతువులు, వస్తువులు ఏమైనా కావచ్చు.
ఉదాహరణ: రాముడు, హైదరాబాద్, భారత, పుస్తకం మొదలుగునవి.
సర్వనామం:
ఒక వాక్యంలో నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామములుగా నిర్వచిస్తారు.
ఉదాహరణ: వారు, వాడు, అది, ఇది, అతడు, ఆమె మొదలగునవి.
క్రియ:
ఒక వాక్యం లో జరిగే పనిని తెలియజేసే పదాలను క్రియ పదాలుగా నిర్వచిస్తారు.
ఉదాహరణ: వస్తాడు, వెళ్ళాడు, చూసారు, తిన్నారు మొదలగునవి
విశేషణం:
ఒక వాక్యంలోని నామవాచకం, సర్వనామముల విశేషణాలను, గుణగణాలను తెలియజేసే పదాలను విశేషణా పదాలుగా నిర్వచిస్తారు.
ఉదాహరణ: అందం, మంచి, ఎరుపు మొదలగునవి
పై అంశాలను అనుసరించి "సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు" అనే వాక్యంలో సూర్యుడు అనే పదం పేరును తెలియజేస్తుంది కావున "సూర్యుడు" అనే పదాన్ని నామవాచకాముగా తెలియజేయబడుతుంది.
#SPJ1