యువత, జీవన నైపుణులు కు
హసం రాయండి
Answers
Answer:
యువతలో జీవన నైపుణ్యాల లేమి
మన తండ్రులు, తాతల వద్ద లక్షలు, కోట్ల రూపాయలు లేకున్నా ఆనందమయ జీవితం గడిపేవారు. అందుకు ప్రధాన కారణం వారసత్వంగా వచ్చిన జీవన నైపుణ్యాలే. వారిలో బతకగలం అనేక మనోధైర్యం ఉండేది. కాని నేటి తరంలో అవి కొరవడుతున్నాయి. మార్కులు, ర్యాంకులే ప్రాతిపదికగా, చిన్నతనం నుండే ఐఐటీలు, మెడికల్ పౌండేషన్‌ల పేరుతో వారి బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేసే స్థాయిలో, ఒత్తిడితో కూడిన విద్యావిధానం, క్రమశిక్షణ కొరవడటం, విచక్షణ లేమి ఇవన్నీ కలిసి విద్యార్థులను మానసిక వికలాంగులుగా తయారు చేస్తున్నాయి. చిన్నపాటి సమస్యను కూడా తనకు తానుగా పరిష్కరించుకోలేని దుస్థితిలోకి విద్యార్థిలోకం నెట్టివేయబడుతుంది అనడంలో సందేహంలేదు.ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించ డంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం. విద్యార్థుల జీవితాలు మధ్యలోనే తుడుచుకుపెట్టుకు పోతున్నాయి. ఆధునిక కాలంలో కాలంతో పాటు పరుగులు తీస్తూ ప్రకృతిని శాసించే స్థాయిలో సాంకేతికంగా ఎంతో పురోగమించాం. ఎన్నో అవకాశాలు, వసతులు, సౌకర్యవంతమైన జీవన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఒత్తిడితో కూడిన చదువ్ఞలు, ఉద్యోగాలు, ఆర్థికంగా ఆకాశాన్ని అందుకోవాలనే ఆలోచనలు, విలాస వంతమైన జీవన విధానాలతో సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సంఘటనను పరిశీలిస్తే పిల్లలు హత్యలు చేయడానికి కూడా ప్రేరేపించబడుతున్నారు. ఒక 14 సంవత్సరాల అబ్బాయి పాఠశాలలో జరిగే పరీక్షను వాయిదా వేయడానికి 10 సంవత్సరా ల పాపను చంపడం నికృష్టమైన చేష్టలకు పురికొల్పబడుతున్నా రు. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు. మన తండ్రులు, తాతల వద్ద లక్షలు, కోట్ల రూపాయలు లేకున్నా ఆనందమయ జీవితం గడిపేవారు. అందుకు ప్రధాన కారణం వారసత్వంగా వచ్చిన జీవన నైపుణ్యాలే. వారిలో బతకగలం అనేకమనోధైర్యం ఉండేది. కాని నేటి తరంలో అవి కొరవడుతున్నాయి. మార్కులు, ర్యాంకులే ప్రాతిపదికగా, చిన్నతనం నుండే ఐఐటీలు, మెడికల్ పౌండేషన్‌ల పేరుతో వారి బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేసే స్థాయిలో, ఒత్తిడితో కూడిన విద్యావిధానం, క్రమశిక్షణ కొరవడటం, విచక్షణ లేమి ఇవన్నీ కలిసి విద్యార్థులను మానసిక వికలాంగులుగా తయారు చేస్తున్నాయి.