ఈ కథకు 'కొత్తబాట' అనే పేరు తగినదని భావిస్తున్నారా? ఎందుకు? చర్చించండి.
Answers
పాకాల యశోదారెడ్డి తన గ్రామంలో వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు కొత్తబాట' అని పేరు పెట్టారు. 'కొత్తబాట' అంటే కొత్తదారి అని అర్థము. యశోదారెడ్డి ఊరిలో ప్రజలు పాత ఆచారాలను వదలి కొత్తదారి పట్టారు. అందువల్ల ఈ కథకు ఆ పేరు సరిపోతుంది. ఆ గ్రామ ప్రజలు పట్టిన కొత్తదారి ఇది.
1) గ్రామంలో పెద్ద ఇళ్ళు ఆడవాళ్ళు సామాన్యుల కంటికి కనబడకుండా వారు ప్రయాణం చేసే బండ్లకు తెరలు కట్టి ఆచారం, నేడు పోయింది.
2) రచ్చబండపై గ్రామ పెద్దతో కలిసి గ్రామస్థులు అందరూ నేడు కూర్చుంటున్నారు.
3) గ్రామ పెద్ద రంగరాయడి వంటి వారి పెత్తనాన్ని, నేడు గ్రామాల్లో ప్రజలు ధిక్కరిస్తున్నారు.
4) పోలీసు పటేళ్ళ పెత్తనమూ, ప్రజలు పోలీసులకు లంచాలివ్వడమూ, తగ్గిపోయింది.
5) ప్రజలు చీటికి మాటికీ తగవులు, కొట్లాటలు మానారు. పంచాయితీలు, జరిమానాలు నేడు లేవు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తీర్పులు ఇస్తున్నారు.
6) రాత్రి దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు ముష్టి ఎత్తుకోడం మానివేశారు. పిల్లలు మంచి వేషాలు వేసుకుంటున్నారు.
7) పెళ్ళిళ్ళలో కూడా మేనాలు, పల్లకీలు, ప్రజలు నేడు మోయడం మానివేశారు.
8) పనిమనుషులను తమతోడి వారుగా గౌరవంగా, ఆదరంగా చూస్తున్నారు.
ఈ విధంగా గ్రామాల్లో ప్రజలు కొత్తబాట పట్టారు. అందువల్ల ఈ కథకు ఈ పేరు బాగా సరిపడింది.
# Thank you ❣️