India Languages, asked by maldoddishruthi, 1 month ago

శతకమధురిమ * వివిధ శతక కవుల వివరాలు; * పూర్వ ం శతక కవులు పద్యా లను తాళపత్త త్రంథాలు పై రాసేవారు కద్య! వారి వలె ఒక శతక కవి వివరాలు రాసి, వారు రాసిన ఐదు శతక పద్యా లు సేకరించి, చార్ట్పై రాసి, ఒక చినన తాళపత్త త్రంథాన్నన తయారు చేయండి.​

Answers

Answered by hanumantkalyankar
1

Explanation:

శతకము (Sathakamu) అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.

NannayyaBaTTu.jpg

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స

తెలుగు సాహిత్యం యుగ విభజన

నన్నయకు ముందు

క్రీ.శ. 1000 వరకు

నన్నయ యుగము

1000 - 1100

శివకవి యుగము

1100 - 1225

తిక్కన యుగము

1225 - 1320

ఎఱ్ఱన యుగము

1320 – 1400

శ్రీనాధ యుగము

1400 - 1500

రాయల యుగము

1500 - 1600

దాక్షిణాత్య యుగము

1600 - 1775

క్షీణ యుగము

1775 - 1875

ఆధునిక యుగము

1875 – 2000

21వ శతాబ్ది

2000 తరువాత

తెలుగు భాష

తెలుగు లిపి

ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు

ఆధునిక యుగం సాహితీకారుల జాబితా

తెలుగు వ్యాకరణం

తెలుగు పద్యం • తెలుగు నవల

తెలుగు కథ • తెలుగు సినిమా పాటలు

జానపద సాహిత్యం • శతక సాహిత్యం

తెలుగు నాటకం • పురాణ సాహిత్యం

తెలుగు పత్రికలు • పద కవితా సాహిత్యము

అవధానం • తెలుగు వెలుగు

తెలుగు నిఘంటువు • తెలుగు బాలసాహిత్యం

తెలుగు సామెతలు • తెలుగు విజ్ఞాన సర్వస్వం

తెలుగులో విద్యాబోధన • అధికార భాషగా తెలుగు

This box: viewtalkedit

"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.[1]

శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే ఉంది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మలయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.తెలుగు సాహిత్యం ప్రసిద్ధి చెందింది

Similar questions