మీరు వృద్దులకు ఎటువంటి సేవలు చేస్తారో మీ సొంతమాటల్లోరాయండి
Answers
Explanation:
సత్యనారాయణపురం, సెప్టెంబరు 29 : వృద్ధులకు సేవ చేస్తే దైవానికి సేవ చేసినట్లేనని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయ్ నర్సింగ్ స్కూల్‌లో ఆదివారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, గాంధీ జయంతి పురస్కరించుకొని వయోవృద్ధా చారిటబుల్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో శతాధిక వృద్ధులను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ట్రస్టు సభ్యులతో కలిసి మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడమే కాక, నిత్యావసర వస్తువులు అందజేస్తున్న ట్రస్ట్ సేవలు నిరుపమానమని కొనియాడారు. మూడు జిల్లాలకు చెం దిన 14మంది శతాధిక వృద్ధులను గుర్తించి వారిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చి సత్కరించడం అభినందనీయమన్నారు. శతాధిక వృద్ధులను ఆదర్శంగా తీసుకొని, మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలన్నారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎవరూ పట్టించుకోని వృద్ధులకు ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ హరికుమార్, ట్రస్టీ, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ నూరేళ్లు దాటిన వృద్ధులను ఒకే వేదికపైకి తీసుకు వచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే స్వయంగా దేవుని ఆశీర్వాదం తీసుకున్నట్లేనని వేదాలు చెబుతున్నాయన్నారు. శతాధిక వృద్ధులను సత్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన దాత నరేంద్ర సంఘ్వీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. వృద్ధులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం శతాధిక వృద్ధులను సత్కరించి వారికి నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు కె.మధుసుదనరావు, గేమ్స్ కమిటీ చైర్మన్ రూపవతి, ట్రస్టీలు సతీష్‌కుమార్, అమరా ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ పాల్గొన్నారు