CBSE BOARD XII, asked by avsgowtham792, 11 days ago

తెలుగు బాషా ప్రశస్త్యం​

Answers

Answered by pikachuu873
0
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇంత మంది మాట్లాడే భాష తెలుగు ప్రజల మాతృభాష కావడం ఆనందదాయకం. తెలుగు పలుకుబడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వానికి తీసిపోని భాషలో మాట్లాడతారంటే అతిశయోక్తి కాదు.
తెలుగు భాష ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతూ వస్తోంది. సాంకేతిక, శాస్త్రియ భాష పదజాలాన్ని కూడా సృష్టించుకుంటోంది. ఇతర భాషా పదజాలాన్ని తనలో జీర్ణం చేసుకోవడం ద్వారా తెలుగు భాష విస్తరిస్తోంది. అనంతమైన పదజాల సృష్టి జరుగుతోంది. తెలుగు భాషా ప్రియులకు ఆ విశాల దృక్పథం ఉంది. తెలుగు భాష అంతరించిపోతుందనే ఆందోళున తెలుగు సమాజంలో గత కొద్ది కాలంగా జరుగుతోంది. అయితే, నిత్య పరిణామశీలమైన తెలుగు భాష ఎప్పటికీ సజీవంగానే ఉఁటుందనే విశ్వాసం దాని విస్తృతిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు కవిత్వందేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇంత మంది మాట్లాడే భాష తెలుగు ప్రజల మాతృభాష కావడం ఆనందదాయకం. తెలుగు పలుకుబడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వానికి తీసిపోని భాషలో మాట్లాడతారంటే అతిశయోక్తి కాదు.
తెలుగు భాష ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతూ వస్తోంది. సాంకేతిక, శాస్త్రియ భాష పదజాలాన్ని కూడా సృష్టించుకుంటోంది. ఇతర భాషా పదజాలాన్ని తనలో జీర్ణం చేసుకోవడం ద్వారా తెలుగు భాష విస్తరిస్తోంది. అనంతమైన పదజాల సృష్టి జరుగుతోంది. తెలుగు భాషా ప్రియులకు ఆ విశాల దృక్పథం ఉంది. తెలుగు భాష అంతరించిపోతుందనే ఆందోళున తెలుగు సమాజంలో గత కొద్ది కాలంగా జరుగుతోంది. అయితే, నిత్య పరిణామశీలమైన తెలుగు భాష ఎప్పటికీ సజీవంగానే ఉఁటుందనే విశ్వాసం దాని విస్తృతిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు కవిత్వం
ఎల్లలు దాటుతోంది. తెలుగు సాహిత్యం, తెలుగు కళలు సరిహద్దులు దాటి విస్తురిస్తున్నాయి.
Similar questions