తెలుగు భాష గొప్పతనాన్ని వ్రాయండి ?
Answers
Answer:
‘తెలుగుభాష తీయదనం.. తెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం’’ అని సినీ గేయ రచయిత చంద్రబోస్ అక్షర సత్యం చెప్పారు. నిజానికి మనం చిన్నప్పుడే బడిలో ‘‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ’’, ‘‘తేనెల తేటల మాటలతో మన తెలుగు దేశ మాతనే కొలిచెదమా’’ అంటూ తేట తెలుగులో పాటలు పాడేవారం. కానీ, ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు వచ్చి పిల్లలకు ఇవన్నీ దూరమవుతున్నాయి. కనీసం తల్లిదండ్రులైనా ఇళ్ల వద్ద పిల్లలకు మన తెలుగును బోధించి, మాతృభాష గొప్పతనాన్ని చెప్పాలి.
మనిషి జీవితంలో మొట్ట మొదటిగా నేర్చుకునే భాష అమ్మభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అలాగే నేర్చుకుంటాడు. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అలాంటి భాషను పరభాషా ప్రమేయంతో ప్రస్తుతం కూనీ చేసేస్తున్నాం. పరభాషను నేర్చుకోవడం తప్పుకాదు. దాని మోజులో పడి మాతృభాషను పక్కనపెట్టడం తప్పు.
em ayadhi black dp petaru
Answer:
తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం⤵️
మన తెలుగు భాష మన అమ్మ దగ్గర నుండే మనకు మొదలు అవుతుంది. తెలుగువారమైన మనకు మన అమ్మ భాష తెలుగే ఉంటుంది… కాబట్టి అమ్మ దగ్గర నుండే తెలుగులో మాట్లడడం, తెలుగులో వినడం ప్రారంభం అవుతుంది. అందుకే తెలుగు భాష మనకు మాతృభాష…
తెలుగులో వినడం ప్రారంభం అవుతుంది. అందుకే తెలుగు భాష మనకు మాతృభాష…ఎవరి అమ్మవారికే గొప్ప అన్నట్టుగా ఎవరి మాతృభాష వారికే గొప్ప… కానీ తెలుగు భాషకు ప్రత్యేకత ఉంటుందని అంటారు. ఎప్పుడో చరిత్రలోనే రాజుల కాలంలోనే దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పబడింది. వ్యాకరణం దీని ప్రత్యేకత… అది ఎంత ప్రత్యేకమో అంత సాధన కూడా అవసరం అంటారు… లేకపోతే తెలుగు వ్యాకరణం నేర్చుకోవడం అంత సులువు కాదని అంటారు.
మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి.